
ఇప్పటికే వైసీపీ కార్యకర్తల కొరకు వాలంటీర్ వ్యవస్థను సృష్టించి నెలనెలా రూ.5,000 జీతాలు చెల్లిస్తోంది. దీని కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.1,596 కోట్లు ఖర్చు చేస్తోంది. వాలంటీర్లతో అధికారులు, ప్రజలు మాట్లాడేందుకుగాను ప్రభుత్వం వారందరికీ స్మార్ట్ ఫోన్లు కొని ఇచ్చింది. దీని కోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 31.92 కోట్లు ఖర్చు చేస్తోంది. వాలంటీర్లు అద్భుతంగా పనిచేస్తున్నారంటూ సన్మానాలు చేసి వారికి మరో రూ.250 కోట్లు చెల్లించింది. ఇప్పుడు వారందరూ న్యూస్ పేపర్లు కొనుక్కోనేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.47.88 కోట్లు విడుదల చేస్తోంది. ఇవన్నీ కలుపుకొంటే జగన్ ప్రభుత్వం సృష్టించిన ఈ వాలంటీర్ వ్యవస్థ కోసం ఏడాదికి రూ.1898.80 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇక సంక్షేమ పధకాల పేరుతో పంచుతున్న లక్షల కోట్లు, వాటి కోసం చేస్తున్న అప్పులపై వడ్డీలు అదనం.
దీనిపై టిడిపి మహిళా నేత అనిత వంగలపూడి స్పందిస్తూ, “జగన్ రెడ్డి చిలక్కొట్టుడు మామూలుగా ఉండదు మరి. తన విషపుత్రిక సాక్షికి ఏడాది పొడుగుతా కోట్లకు కోట్లు ప్రకటన రూపంలో ఇస్తుంది. అదిచాలక ఇప్పుడు ఏడాదికి 64 కోట్లు సాక్షికి మళ్ళించే ఎత్తుగడ. వాలంటీర్లు అందరూ వాడేది స్మార్ట్ ఫోన్లు. ఈపేపర్ ఉంది కదా? మళ్ళీ జనం సొమ్ము ఇల్లా మళ్ళించడం ఎందుకు?”అని ట్వీట్ చేస్తూ దినపత్రికలో వచ్చిన ఈ వార్తకు సంబందించి ఫోటోను ట్విట్టరులో పెట్టారు.
దీనిపై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టరులో స్పందిస్తూ, “మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అనే రకం జగన్ మోసపు రెడ్డి. జనం సొమ్ము దోపిడీకి జగన్ ఆడని నాటకం లేదు. వైసీపీ కార్యకర్తలందరినీ వాలంటీర్లుగా పెట్టుకొని పార్టీ కోసం పనిచేయిస్తూ ప్రజాధనం వారికి ఈవిదంగా ధారపోస్తున్నారు,” అని ట్వీట్ చేశారు.
ఇది గతంలో జగన్ చేసిన క్విడ్ ప్రో వ్యవహారంలాగే ఉందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…