
తొలిసారిగా టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఇద్దరు వైసీపీ నేతలపై కోర్టులో క్రిమినల్ కేసులు వేశారు. వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత, వైసీపీ సోషల్ మీడియా కోర్డినేటర్ గుర్రంపాటి దేవదర్ రెడ్డిలపై మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు వేసినట్లు నారా లోకేష్ తరపు న్యాయవాది కోటేశ్వరరావు తెలిపారు.
ఈ ఏడాది ఆగస్ట్లో నందమూరి ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకొన్నారు. ఆమె తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఆత్మహత్యకి పాల్పడినట్లు పోలీసులు ధృవీకరించారు. కానీ నారా లోకేష్ ఆమెను స్థిరాస్తులు, ఆర్ధికవిషయాలలో మోసం చేసినందునే ఆత్మహత్య చేసుకొన్నారంటూ గుర్రంపాటి దేవదర్ రెడ్డి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణిలను ఉద్దేశ్యించి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిరువురి మాటలు, వ్రాతలకు సంబందించి పత్రికలలో, సోషల్ మీడియాలో వచ్చిన ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు కోటేశ్వరరావు తెలిపారు. సమాజంలో చాలా గౌరవ ప్రతిష్టలు కలిగిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కుటుంబాల గురించి అనుచితంగా మాట్లాడి వారి ప్రతిష్టకు భంగం కలిగించినదుకు ఇద్దరు వైసీపీ నేతలపై ఐపిసి సెక్షన్స్ 499,500 ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరినట్లు నారా లోకేష్ న్యాయవాది కోటేశ్వరరావు తెలిపారు.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…