
ఇప్పుడు నారా లోకేష్ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏవిదంగా ఇసుక దోపిడీ చేస్తున్నారో సెల్ఫీతో చూపించారు. “అబ్బాయ్ కేతిరెడ్డి కబ్జాలు ధర్మవరంలో చూశాం. తాడిపత్రిలో బాబాయ్ కేతిరెడ్డి దోపిడీలో అబ్బాయ్ని మించిపోయాడు. పెద్దపప్పూరు మండలం పెన్నానదిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాఫియా పెద్దఎత్తున ఇసుక తవ్వి తరలించే రీచ్ ఇది. ఇసుక తవ్వకాలకు 10 ఎకరాలు కేటాయిస్తే, పదింతల విస్తీర్ణంలో తవ్వకాలకి బరితెగించారు. ప్రతి రోజు ఈ రీచ్ నుండి సుమారుగా 150 టిప్పర్ల ఇసుక తరలిస్తోంది బాబాయ్ గ్యాంగ్. నేను వస్తున్నానని తెలిసి రెండు రోజుల క్రితమే రీచ్ బంద్ చేసినా, ఇసుక మాఫియా విధ్వంసం ఆనవాళ్లు అలాగే ఉన్నాయి,” అంటూ ట్వీట్ చేశారు.
మంగళవారం సాయంత్రం పాదయాత్ర చేస్తుండగా దారిలో టిడిపి అభిమానులు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ బ్యానర్ వద్ద నారా లోకేష్ ఆగి సెల్ఫీ దిగి దానినీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ చిత్రపటంతో ఉన్న ఆ బ్యానర్లో వీటిలో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏది? 1. పులివెందుల? 2. అమరావతి? 3. కర్నూల్? 4. వైజాగ్? కనుగొన్నవారికి రూ.1,00,000/- శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా బహుమతి అందించబడును.”
పెద్దపప్పూరు మండలం పెన్నానదిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇసుక మాఫియా గురించి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని నారా లోకేష్ సవాళ్ళకు వైసీపీ నేతలు ఎవరైనా సమాధానం చెప్పగలరా?
Venkatesh and Trivikram Srinivas’ upcoming entertainer Aadarsha Kutumbam House No. 47 is slowly losing its…
Sara Ali Khan brings a burst of sunshine to traditional Indian fashion in a vibrant…