
ఓ పక్క విద్యుత్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు, రొయ్యల దాణా రేట్లు పెరగగా, మరోపక్క రొయ్యల ధరలు తగ్గడంతో ఆక్వా రైతులు తీవ్రం నష్టపోతున్నారని తెలిసి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణమన్నారు. ఆక్వా రైతులు కూడా ఆక్వా హాలీడే ప్రకటించక మునుపే ప్రభుత్వం మేల్కొని పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణం తగ్గించి వారిని ఆదుకోవాలని లేకుంటే రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యవసాయం లాగే ఆక్వా రంగం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని సిఎం జగన్మోహన్ రెడ్డికి లేఖలో సూచించారు.
ఇలా రాష్ట్రంలో ఒక్కో రంగం దెబ్బతింటుంటే ప్రభుత్వం ఏమి చేస్తోందని నారా లోకేష్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రోజురోజుకీ సమస్యలు పేరుకుపోతున్నాయని కానీ జగన్ సర్కార్ ఎంతసేపు అప్పులు చేయడం, సంక్షేమ పధకాల డప్పు కొట్టుకొంటూ ఎన్నికల గురించి ఆలోచిస్తోంది తప్ప రాష్ట్రంలో ఒక్క సమస్యను కూడా పరిష్కరించడంలేదని నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…