
2019 ఎన్నికలలో వైసీపీకి వరంగా మారిన వివేకా హత్య కేసే ఈ ఎన్నికల ఏడాదిలో వైసీపీకి శాపంగా మారబోతుండటం చూస్తే నిజంగా దేవుడి స్క్రిప్టే అనిపించకమానదు. అయితే ఇందులో వైసీపీ స్వయంకృతాపరాధం కూడా ఉందనే చెప్పవచ్చు. వైసీపీ ప్రభుత్వం కనుసన్నలలో పనిచేసే సిట్ బృందం దర్యాప్తు చేస్తున్నప్పుడే ఈ కేసును ఓ కొలిక్కి తెచ్చి ఉంటే నేడు ఇటువంటి దుస్తితి, ఆందోళన ఉండేవే కావు.
కానీ సీబీఐని పిలిచి దాని చేతికి ఈ కేసును అప్పగించడం మొదటి పొరపాటు. ఆ తర్వాత ఈ కేసును నాలుగేళ్ళపాటు ముందుకు సాగనీయకుండా సీబీఐతో ఆటలు ఆడుకోవడం రెండో పొరపాటు. ఒకవేళ అప్పుడే సీబీఐకి సహకరించి, నిందితులను జైలుకి పంపించి ఉండి ఉంటే, ఈపాటికి ప్రజలు కూడా ఈ కేసు గురించి మరిచిపోయి ఉండేవారు. కానీ ఎన్నికల సంవత్సరం వరకు కేసును ఈడ్చుకొని రావడం మరో పొరపాటు.
అన్ని సాక్ష్యాధారాలతో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి తదితరులను నిందితులుగా నిరూపించేందుకు సిద్దమైనప్పుడు కూడా వైసీపీ ఇంకా వారిని వెనకేసుకువస్తుండటం ఇంకో పొరపాటు అని చెప్పవచ్చు. ఈ తప్పటడుగులు సరిపోవన్నట్లు ఎన్నికల సంవత్సరంలో వైసీపీ చేతే వైఎసార్ కుటుంబం పరువు తీయించుకొంటుండటం ఇంకా విడ్డూరమైన విషయం.
దేవుడే వైసీపీని ఈవిదంగా నడిపిస్తున్నాడేమో?అందుకే వైసీపీ తాను కూర్చొన్న కొమ్మను నరుక్కొంటోందేమో?అనిపించక మానదు. నారా లోకేష్ ఇదే చెప్పారు కదా?
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…