Telugu

పనికి రానివి పట్టుకోవద్దు – నారా లోకేష్!

రాజకీయ నాయకులు ఆవేశంలో మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లుతాయన్న విషయం తెలిసిందే. ఇందుకు ఏ నాయకుడు కూడా అతీతులు కారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ విషయం మాత్రం ఎక్కువగా హైలైట్ అవుతుంది. ముఖ్యంగా జగన్ మీడియాలో పదే పదే అవే వ్యాఖ్యలను ప్రసారం అవుతాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇలాంటి సమయంలోనే హుందాతనం బయట పడుతుందన్న అభిప్రాయాన్ని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.

ఓ నాలుగు మాటలు స్పీడ్ గా మాట్లాడేటపుడు సహజంగా ఎవరికైనా తప్పులు దొర్లుతాయి. ఒక్క పదం కాస్త అటు ఇటుగా మాట్లాడితే, మొత్తం భావాన్నే వక్రీకరించే విధంగా చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. అట్లా చేసే మేము దుమ్మెత్తిపోయొచ్చు. వాళ్ళు చేసిన వ్యాఖ్యలన్నీ బయటకు తీస్తే ఎన్ని తప్పులు చేసారో తెలుస్తుందని చెప్పిన లోకేష్, ఏకంగా జగన్ చేసిన తప్పుకు కౌంటర్ వేసారు. ‘మల్టిప్లికేషన్ లేని వారు కూడా ఆ పార్టీలో ఉన్నారంటూ’ గతంలో అసెంబ్లీ వేదికగా జగన్ చేసిన ‘మల్టిప్లికేషన్’ తప్పును ప్రస్తావించారు లోకేష్.

ADVERTISEMENT

ఫైనల్ గా… ఇలాంటి పనికి రాని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదంటూ మీడియా వర్గీయులకు సూచనలు చేసిన లోకేష్, ఇటీవల సదావర్తి సత్రం భూముల విషయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేసారు. తన దగ్గర అంత ‘వైట్’ అమౌంట్ లేదని చెప్పిన ఆర్.కే వద్ద ఉన్న నల్లధనం ఎంతో బయటపెట్టాలని, అసలు డబ్బులు లేకుండా కోర్టుకు ఎందుకు వెళ్ళారని, కోర్టు అయితే 2 వారాల సమయమే ఇచ్చిందేమో, మేమయితే నాలుగు వారాలు ఇచ్చేవారమని ఎటకారపు పంచ్ లు వేసారు లోకేష్.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Irumudi Is A Miracle In Mythri’s Journey: Producers

The Irumudi team had plenty to celebrate as the film’s extraordinary theatrical run continues, with the movie…

47 minutes ago

సీఎం హోదాలోనే అసెంబ్లీ కి…

ఈ మధ్య రాజకీయాలలో అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీ కి వెళ్ళేది లేదు అనే ఒక వింత సంస్కృతీ మొదలయ్యిందనే…

52 minutes ago