Telugu

హేయ్ జగన్‌! ఒక్క హ్యాపీ సెల్ఫీ ఇవ్వగలవా?

టిడిపి యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రపై మొదట తీవ్రస్థాయిలో మూకుమ్మడిగా విరుచుకుపడిన వైసీపీ నేతలందరూ ఇప్పుడు ‘సైలెంట్ మోడ్’లో ఉండిపోవడం ఆశ్చర్యమే కానీ అదీ… ఐ-ప్యాక్ సూచన కావచ్చు. నారా లోకేష్‌ ప్రజల మద్య నిలబడి తొడగొట్టి మీసం తిప్పుతూ దమ్ముంటే రండి తేల్చుకొందాం అని రోజూ సవాళ్ళు విసురుతుంటే కనీసం ఒక్క మంత్రి, ఒక్క వైసీపీ నేత స్పందించడం లేదు.

నారా లోకేష్‌ సవాళ్ళలో వెరైటీగా సెల్ఫీ సవాళ్ళు విసురుతుండటం విశేషం. గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు, ఎక్కడెక్కడ ఏఏ పనులు జరిగాయో, ఏఏ పరిశ్రమలు స్థాపించబడ్డాయో చూపిస్తూ అక్కడి ఉద్యోగులతో సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పెడుతూ, “మూడున్నరేళ్ళలో మీ వైసీపీ ప్రభుత్వం ఏమి చేసిందో సెల్ఫీ తీసుకొని చూపాలంటూ..” నారా లోకేష్‌ సవాళ్ళు విసురుతున్నారు. రేణిగుంటలో పాదయాత్ర చేస్తున్నప్పుడు, దారిలో జోహో ఐ‌టి కంపెనీ కనిపిస్తే, లోనికి వెళ్ళి అందరినీ పలకరించి కంపెనీ ఎలా నడుస్తోందో అడిగి తెలుసుకొన్నారు. తర్వాత ఆ కంపెనీని చూపిస్తూ ఒకటి, దానిలో పనిచేస్తున్న ఉద్యోగులతో మరొక సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ADVERTISEMENT

దాంతో పాటు “హేయ్ జగన్, జోహో కంపెనీలో పనిచేస్తున్న ఈ ఉద్యోగుల కళ్ళలో ఆనందం, వారి మొహాలలో చిర్నవ్వులు చూశావా? ఈ నాలుగేళ్ళలో నువ్వు ఏ ఒక్కరి మొహంలోనైనా ఆనందంతో చిర్నవ్వు చిందించే ఒక్క పని చేశావా?ఉంటే చూపగలవా?” అంటూ నారా లోకేష్‌ సెల్ఫీ సవాల్ విసిరారు.

నారా లోకేష్‌ ఈరోజు తిరుపతి పాదయాత్ర చేస్తున్నప్పుడు దారిలో ఆటోడ్రైవర్లని పలకరించి మాట్లాడారు. వారు ఆప్యాయంగా ఇచ్చిన ఖాకీ చొక్కని ధరించి వారితో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా వారు పెట్రోల్, డీజిల్ రేట్ల పెరిగిపోతుండటంతో రోజంతా ఆటోలు తిప్పినా గిట్టుబాటు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నారా లోకేష్‌ స్పందిస్తూ, “దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకున్నాయంటే, రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అధిక పన్నే కారణం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా పన్నుని కొంత తగ్గించుకొంటే తప్పకుండా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయి. కానీ జగన్ ప్రభుత్వం ఆ ఆదాయాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. కనుక పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే సరుకు రవాణా ఛార్జీలు పెరుగుతాయి. దాంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతుంటాయి. రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే ఈ పెట్రోల్, డీజిల్ రేట్లపై పన్ను తగ్గించి ప్రజలపై ధరల భారం తగ్గిస్తాము,” అని నారా లోకేష్‌ హామీ ఇచ్చారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bigg Boss Telugu: Thrigun’s Toxic Manipulative Game

Bigg Boss Telugu Season 10 gameplay has reached an entirely new level. Everything was good…

29 minutes ago

టీడీపి-జనసేన ఐఖ్యతను పునర్నిర్వచించుకోక తప్పదా?

మున్సిపల్ ఎన్నికలలో సీట్ల కేటాయింపుపై టీడీపి, జనసేన రెండు పార్టీలలో తిరుగుబాట్లు కూటమి ఐఖ్యతని, మనుగడని ప్రశ్నిస్తున్నట్లే ఉన్నాయి. టీడీపి…

29 minutes ago