Telugu

నేను మూర్ఖుడిని… ఖచ్చితంగా ఒక్కొక్కరికి సినిమా చూపిస్తా..!

మంగళగిరి వేదికగా 40 ఏళ్ళ టీడీపీ ఆవిర్భావ పండగను జరుపుకున్న సభలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా నిలిచాయి. ఎన్టీఆర్ దేవుడు, చంద్రన్న రాముడు… కానీ ఈ లోకేష్ మూర్ఖుడు అంటూ లోకేష్ చేసిన ప్రసంగం కార్యకర్తలను నూతన ఉత్సాహంలోకి నెట్టివేసింది. అంతేకాదు ఈ సందర్భంగా అధికారులకు మరియు వైసీపీ వర్గాలకు వార్నింగ్ కూడా ఇచ్చారు లోకేష్.

“ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మాయా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే మా కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేసారో… వారందరికీ చెప్తున్నా… మీ అందరికి సినిమా మొదలవబోతోంది. మీరు అమెరికాకు వెళ్లినా, ఐవరీ కోస్ట్ కు వెళ్లినా నేను మాత్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటానని” ఈ సభా ముఖంగా వారందరికీ తెలియజేస్తున్నానని అన్నారు.

ADVERTISEMENT

అసెంబ్లీలో తన తల్లిని అవమానించిన నాటి నుండి లోకేష్ వివిధ సందర్భాలలో ఇదే రీతిలో వైసీపీ వర్గాలకు వార్నింగ్ ఇస్తూ వస్తున్నారు. అంతకు ముందు వరకు సంయమనం పాటించినప్పటికీ, అసెంబ్లీ ఉదంతం తర్వాత మాత్రం తన దూకుడును ఓ స్థాయిలో పెంచారు లోకేష్. ‘తన తండ్రి అంత మంచివాడిని తానైతే కాదని, ప్రస్తుతం జరుగుతున్న వాటికి భవిష్యత్తులో ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని’ హెచ్చరించారు.

ప్రస్తుతం కూడా అదే పంథాలో ఉన్నట్లున్నారు. టీడీపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఒక వ్యక్తి మీద ఎక్కువ కేసులుంటే చంద్రన్న అసలు ఉరుకునే వాడు కాదని, కానీ కేసులకు భయపడకుండా గత మూడేళ్లుగా పోరాడుతూనే ఉన్నామని, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని, భవిష్యత్తులో కూడా ఇదే పోరాట పటిమను ప్రదర్శిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు లోకేష్.

గత ఎన్నికలలో ఓటమి పాలైనప్పటికీ, ఆ ఓటమికి గల తప్పులను అన్వేషించుకుని మంగళగిరి నియోజక వర్గంలో గడిచిన ఏడాది కాలంగా పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం లోకేష్ కు వచ్చిన రాజకీయ పరిణితిగా భావించవచ్చు. నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలలో ఇప్పటికే పాదయాత్రను పూర్తి చేసిన లోకేష్, వచ్చే ఎన్నికలలో మంగళగిరిలో పసుపు జెండా ఎగురవేయాల్సిందేనని కంకణం కట్టుకున్నారు.

ఎక్కడైతే పోగొట్టుకున్నారో, అక్కడే వెతుక్కునే పనిలో లోకేష్ ఉన్నట్లున్నారు. అలాగే ఎవరైతే తమను హింసిస్తున్నారో, వారికి భవిష్యత్తులో బుద్ధి చెప్తానని వార్నింగ్ లు కూడా అదే స్థాయిలో ఇస్తున్నారు. 2024లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రత్యర్థులకు “సినిమా” చూపించడానికి, స్క్రిప్ట్ లైతే సిద్ధం చేస్తున్నట్లున్నారు. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయి. తెలుగు తమ్ముళ్లు ఈ ప్రసంగాలకు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

\
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

రాచమల్లు: ఏకగ్రీవాలతో ఓటర్లకు 16 వేలు లాస్

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత కాస్టలీ అనేది నేటి రాజకీయ నాయకులు లెక్కలతో సహా వివరిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న స్థానిక…

17 minutes ago

After The Paradise, Nani Is Taking No Chances

Nani seems to be taking a cautious approach with Bloody Romeo after his experience with…

23 minutes ago