
ఇక తారకరత్నకి టికెట్ లభిస్తుందా లేదా అనే ప్రశ్నకి ముందు ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి చెప్పుకోవలసి ఉంటుంది. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలోని 175 స్థానాలు గెలుచుకొంటామని సిఎం జగన్మోహన్ రెడ్డి చెపుతుండటమే కాక టిడిపికి బాగా బలం ఉన్న ప్రతీ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ వైసీపీని గెలిపించుకొనేందుకు అప్పుడే పావులు కదుపుతున్నారు. కనుక వచ్చే ఎన్నికలలో ప్రతీ నియోజకవర్గంలో టిడిపి, వైసీపీల మద్య భీకరమైనపోరు జరుగబోతోంది. జనసేన కూడా టిడిపితో పొత్తులకి ఆసక్తి చూపుతోంది కనుక దానికీ కొన్ని సీట్లు కేటాయించవలసి ఉంటుంది. ఇక వచ్చే ఎన్నికలలో తెలంగాణ సిఎం కేసీఆర్ నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీ కూడా ఏపీలో పోటీ చేయబోతోంది. కనుక వచ్చే ఎన్నికలలో పార్టీల మద్య ఓట్లు చీలిపోతే దేనికీ భారీ మెజార్టీ లభించకపోవచ్చు. ఈ పరిస్థితులలో ప్రతీ ఒక్క సీటు చాలా కీలకంగా మారుతుంది. కనుక ఈ పరిస్థితులలో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగాలనుకొంటున్న తారకరత్నతో చంద్రబాబు నాయుడు ప్రయోగం చేసేందుకు అంగీకరిస్తారో లేదో చూడాలి.
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…
The promotional materials for Nitesh Tiwari’s Ramayana are back in the headlines again. While the…