
ఈ నేపథ్యంలో చంద్రబాబుకు జగన్ క్షమాపణ చెప్పాలంటూ అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ లో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ద్విచక్రవాహనాలతో ర్యాలీగా వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగి, పరస్పర దాడులు జరిగాయి. దీంతో, ఉద్రికత్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో… రంగంలోకి దిగిన పోలీసులు రెండు పార్టీలకు చెందిన పలువురుని అరెస్టు చేశారు.
ఇదిలా ఉంటే… ఎవరూ ఎలాంటి ఆవేశానికి లోను కావద్దని టీడీపీ నేత నారా లోకేశ్ తమ శ్రేణులకు పిలుపునిస్తూ… ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసారు. టీడీపీ శ్రేణులను వైఎస్సార్సీపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని, అనంతపురంలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనమని అన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకమని, మన శక్తియుక్తులన్నిటినీ రాష్ట్ర అభివృద్ధి కోసమే వినియోగిద్దామని లోకేశ్ సూచించారు.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…