
విద్యార్థిని కుటుంబ సభ్యుల పరామర్శ కోసం బయలుదేరిన టీడీపీ యువ నాయకుడు లోకేష్ కు అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు. నారా లోకేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పొలిటికల్ కెరీర్లో తొలిసారిగా అరెస్టయ్యారు. లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు ధూళిపాళ్ల, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబును అరెస్ట్ చేశారు.
అక్కడితో ఆపకుండా లోకేష్ ని ఒక పోలీసు స్టేషన్ లో పెట్టి మిగతా వారిని ఇంకో స్టేషన్ కి తరలించారు. అసలు ఇంత చిన్న విషయంలో ప్రభుత్వం ఎందుకు ఓవర్ గా రియాక్ట్ అవుతుందో అర్ధం కాని పరిస్థితి. లోకేష్ అరెస్ట్ కావడంతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. రాష్ట్రం మొత్తం ఇదే చర్చ నడుస్తుంది.
టీవీ ఛానెల్స్ లో ప్రైమ్ టాపిక్ ఇదే కావడంతో లోకేష్ కు ప్రభుత్వం విపరీతమైన మైలేజ్ ఇచ్చినట్టే. సహజంగా ఇటువంటి కేసులలో పోలీసులు చీకటి పడిన వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తారు. అయితే లోకేష్ ని మాత్రం పోలీస్ స్టేషన్లు మార్చుతూ హైడ్రామా నడిపించారు. స్టేషన్ బెయిల్ ఇవ్వరు అని కూడా వదంతులు వినిపించాయి.
నిన్నటి వరకు లోకేష్ ని పప్పు అంటూ తేలికగా తీసుకున్న అధికార పార్టీ… సడన్ గా ఇంత సీరియస్ గా తీసుకుందంటే లోకేష్ ని నాయకుడిని చేసినట్టే. అలా అని ఒప్పుకున్నట్టే అని టీడీపీ సమర్ధకులు అంటున్నారు. స్టేషన్ బెయిల్ ఇవ్వకపోయినా పర్వాలేదని, ఎంత ఇబ్బంది పెడితే అంత నాయకుడు అవుతాడని అభిమానులు అభిప్రాయపడ్డారు.
అయితే అంతవరకు వెళ్లకుండా లోకేష్ ని విడుదల చేశారు. అప్పుడు వచ్చిన జనసందోహాన్ని బట్టి ప్రభుత్వానికి తాము చేసిన తప్పేంటో తెలిసి ఉండాలి. ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంది రాటు దేలిన జగన్ కు ఈ విషయం తెలియకుండా ఉండదు అయినా తప్పులో కాలేసింది ప్రభుత్వం. నాయుడుని నాయకుడిని చేసిన జగన్ అని సోషల్ మీడియా లో చర్చ నడుస్తుంది.
Annayya Paanam Lo Poosina Puvvulu, the second single from Sharwa’s Bhogi, focuses on family relationships…
India's 2-2 T20I series draw against the West Indies has exposed a concern that the…