
ఈరోజు దారిలో ఆయనకు కొంత దూరంలో గొర్రెలకాపరులు కనిపించారు. నారా లోకేష్ వారి వద్దకు వెళ్ళి పలకరించేసరికి వారూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నారా లోకేష్ గురించి న్యూస్ పేపర్లు, టీవీ వార్తలలో చూడటమే తప్ప చాలామంది ఇలా ముఖాముఖీ చూసి ఉండరు కనుక!
నారా లోకేష్ వారితో మాట్లాడుతున్నప్పుడు టిడిపి సోషల్ మీడియా బృందం వారిని కెమెరాలు, డ్రోన్ కెమెరాతో కవర్ చేసింది. దానిని వైసీపీకి చెందిన ఎవరో ఫోటో తీసి, సోషల్ మీడియాలో పెడితే దానిపై వైసీపీ సోషల్ మీడియా బృందం “చూశారా ఎంత ప్రచారయావో… జనం లేకపోయినా హడావుడికి తక్కువ లేదు…” అంటూ విమర్శలు గుప్పించింది.
నారా లోకేష్ ఇంత మండుటెండల్లో పార్టీ కోసం, ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నప్పుడు దానిని కవర్ చేసి సోషల్ మీడియాలో పెట్టుకోవాలనుకోవడం సహజం. దీని కోసం టిడిపి సొంత సోమ్మే ఖర్చుపెట్టుకొంటోంది తప్ప వైసీపీలాగా ప్రజాధనం ఖర్చుపెట్టడం లేదు కదా? అయినా నారా లోకేష్ వెంట జనాలు నడిస్తే వైసీపీకి ఎందుకు? నడవకపోతే ఎందుకు?ఒకవేళ జనాలు లేకపోతే ఆయన, టిడిపి బాధపడాలి కానీ వైసీపీ ఎందుకు బాధపడుతోందో అర్దం కాదు.
నారా లోకేష్ డ్రామా ఆడుతున్నారంటూ వైసీపీ చేసిన విమర్శలకు టిడిపి సోషల్ మీడియా ఇచ్చిన జవాబు అలా ఇలా లేదు. ఆనాడు ఓదార్పుయాత్రలో మీ అధినేత జగన్మోహన్ రెడ్డి కల్లబొల్లి ఏడుపులు, డ్రామాలు ఇవిగో చూడండి… అంటూ ఆనాటి పాత ఫోటోలను పెట్టి, ఈ నటనకు ఆస్కార్ అవార్డ్ ఇవ్వాల్సిందే కదా?అంటూ ఎద్దేవా చేశారు.
సిఎం జగన్మోహన్ రెడ్డి ఓ సంక్షేమ పధకానికి బటన్ నొక్కితే, దాని కోసం వందల కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి ప్రకటనలు ఇచ్చుకోవడం వైసీపీకి తప్పనిపించలేదు. చివరికి వాలంటీర్లను, సచివాలయ సిబ్బందికి, మంత్రులు, ఎమ్మెల్యేలకు స్టిక్కర్స్ అంటించే పని చేయించుకొన్నా తప్పనిపించదు. కానీ నారా లోకేష్ మండుటెండలో పాదయాత్ర చేస్తూ దారిలో గొర్రెల కాపరుల దగ్గదరికో, రైతుల దగ్గరికో వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఫోటోలు తీస్తే మహాపచారం అంటుంది.
ఎవరైనా మీపైనే నమ్మకం పెట్టుకొన్నామనడం కామన్ కానీ వైసీపీ మాత్రం జగనన్న మీద జనం నమ్మకం పెట్టుకొన్నారని ఆత్మవంచన చేసుకొంటోంది. ఇదేం సిత్రమో?
Festival releases are usually a dream for film producers for better openings and a chance…
Yashasvi Jaiswal has started working on wicketkeeping ahead of the 2026-27 Ranji Trophy season, but…