Telugu

‘బాబు…’ ఈజ్ ది ‘బాస్..!’

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్… తన తండ్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుని ఏమని సంబోధిస్తారు? ఇంటిలో ఏమని పిలుస్తారన్న విషయాన్ని పక్కనపెడితే… బహిరంగ సభలు, మీడియా సమావేశాల్లో ఏమని సంబోధిస్తారన్న విషయాన్ని పరిశీలిస్తే కాస్తంత వైవిధ్యం కనబడుతోంది. ‘టిడిపి అధినేత’గా తన తండ్రిని సంబోధించే లోకేశ్… కొన్నిసార్లు ‘ఏపీ సీఎం’ అని ప్రస్తావిస్తారు. అయితే బుధవారం నాడు హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా లోకేశ్ తన తండ్రిని ‘బాస్’గా అభివర్ణించారు.

ఏపీ కోటాలోని రాజ్యసభ సీటును తెలంగాణకు చెందిన పార్టీ నేతలకు ఇచ్చే ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని ‘బాస్’ ఎప్పుడో చెప్పేసారని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు తమను పంపించాలని పలువురు తెలంగాణ టీడీపీ నేతలు చేస్తున్న విజ్ఞప్తులను నారా లోకేష్ కొట్టిపడేస్తూ ఈ వ్యాఖ్యలు చేసారు. ఏపీ కోటా రాజ్యసభ సీటును తెలంగాణ నేతలకు కేటాయించడం కుదరదని, అసలు ఎలా సాధ్యమవుతుందని ఎదురు ప్రశ్నించారు.

ADVERTISEMENT

శుక్రవారం నుండి మూడు రోజుల పాటు తిరుపతిలో జరగనున్న టీడీపీ మహానాడు వేడుకకు హాజరయ్యేందుకు లోకేశ్ నారావారిపల్లె చేరుకోగా, టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా నేటి రాత్రికి సొంతూరుకు చేరుకోనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో చంద్రబాబుతో పాటు లోకేశ్ కూడా ప్రారంభం నుంచి ముగింపు దాకా పాల్గొంటారు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు రాత్రి నారావారిపల్లెలో బస చేయనున్నారు.

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

బడా తెలుగు సినిమా ప్రొడక్షన్ లో భారీ స్కామ్!

రిలీజ్ కి రెడీ అవ్వాల్సిన ఓ ప్యాన్ ఇండియా సినిమా, ఇప్పటికే ఆ సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు…

32 seconds ago

Indian Arrested for Sexually Assaulting Teen Girl

Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…

8 hours ago