
నరసాపురానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారితో తన అక్కకు ఏడాది క్రితమే పెళ్లయిందని… దీంతో అతని మొదటి భార్య ఇప్పటికే తన అక్కను ఎన్నోసార్లు బెదిరించిందని తెలిపింది. అక్కకు ఒంట్లో బాగోలేకపోవడంతో పాలకొల్లులోని ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకుని, తిరిగి వస్తుండగా, ఓ వాహనం తమను వెంబడించిందని… దిగమర్రు వద్దకు వచ్చేసరికి తమను వేగంగా ఢీకొందని చెప్పింది. అక్కపై నుంచి వెళ్లిన వాహనం, తనను కొంతదూరం పాటు ఈడ్చుకెళ్లిందని తెలిపింది.
అయితే కొంతదూరం వెళ్లాక ఆ వాహనం కూడా అదుపుతప్పి కాలువలోకి పడిపోయిందని చెప్పింది. ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయానని తెలిపింది. తన అక్కను పెళ్లి చేసుకున్న వ్యక్తి యొక్క మొదటి భార్యనే, తన డ్రైవర్ తో ఈ పని చేయించిందనేది తన అనుమానమని చెప్పింది. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని, తమను ఢీకొన్న వాహనంలో ముగ్గురి కంటే ఎక్కువ మంది ఉన్నట్టు అనిపించిందని తెలిపింది. దీంతో ఈ ప్రమాదం వెనుక హత్య కోణం ఉందా? అనే అనుమానం కూడా వస్తోంది. పోలీసులు కూడా ఈ కోణంలో సైతం దర్యాప్తును ప్రారంభించారు.
New Zealand ended the five match T20I series on a winning note after defeating India…
Confusion over Chiranjeevi’s Sankranthi releases is growing, but UV Creations continues to remain silent. While…