
బెంగళూరులో కేవలం 40,940 యూనిట్ల విక్రయాలు మాత్రమే సాగాయని, కొత్త ఆవిష్కరణలు ఏకంగా 61 శాతం పడిపోయాయని వెల్లడించింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పుణె, చెన్నై, హైదరాబాద్, కోల్ కతా, అహ్మదాబాద్ నగరాల్లోని నిర్మాణ రంగ వ్యాపారంపై విశ్లేషించి ఈ నివేదిక తయారు చేసినట్టు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. నవంబర్ 8 తరువాత ఈ రంగంలో లావాదేవీలు దాదాపు ఆగిపోయాయని, 2008 నాటి ఆర్థిక మాంద్యం తరువాత అత్యంత క్లిష్ట పరిస్థితులను రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఎదుర్కొంటున్నారని తెలిపింది.
ఎనిమిది నగరాలనూ కలిపి పరిశీలిస్తే, 2015లో 2,67,960 యూనిట్ల విక్రయాలు జరుగగా, ఈ సంవత్సరం అది 9 శాతం తగ్గి 2,44,680 యూనిట్లకు తగ్గిందని వెల్లడించింది. వాస్తవానికి గత సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో రెసిడెన్షియల్ మార్కెట్ 7 శాతం వృద్ధిని నమోదు చేసిందని, ఆపై నిదానంగా సాగుతూ, నవంబర్ తరువాత పూర్తిగా నిలిచినట్లయిందని పేర్కొంది. ఆ ఎనిమిది నగరాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా పరిస్థితి ఇదే విధంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.
Manjari Fadnnis is setting screens ablaze with a spellbinding beachside photoshoot drenched in pure golden…
After the back to back failures of Jolly O Gymkhana and Badass Ravi Kumar, Prabhu…