
అనుకున్న మేరకు ప్రధాని వద్ద మోత్కుపల్లి పేరును కూడా ప్రస్తావించారు. అయితే తెరవెనుక ఏం జరిగిందో గానీ, పలు దఫాలుగా రాష్ట్రాలకు నియమిస్తున్న గవర్నర్ల స్థానంలో మోత్కుపల్లికి చోటు లభించడం లేదు. ఇప్పుడు మిగిలిన మూడు రాష్ట్రాలకు కూడా గవర్నర్లను ప్రకటించడంతో ఆశలు అడుగంటిపోయాయి. ఇప్పుడు మోత్కుపల్లికి ఒకే ఒక్క చాన్స్ మిగిలి ఉంది. వచ్చే ఏడాదితో తమిళనాడు గవర్నర్ రోశయ్య పదవీ కాలం ముగియనుంది. మరి ఆ స్థానంలో మోత్కుపల్లికి ప్రధాని అవకాశం కల్పిస్తారో లేదో వేచి చూడాల్సిందే.
అయితే మరోసారి కూడా రోశయ్యనే గవర్నర్‌గా కొనసాగించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధానిని అభ్యర్థించారు. అదే కనుక జరిగితే మోత్కుపల్లికి ఉన్న ఒకే ఒక్క అవకాశం కూడా మూసుకుపోయినట్టే. ‘నన్ను గవర్నర్ ను చేస్తారన్న విషయం నాక్కూడా తెలియదు. ‘నువ్వు ఏ క్షణాన్నయినా గవర్నర్ అయ్యే అవకాశం ఉందని గతేడాది మా బాస్ చెప్పినప్పుడు నాకు తెలిసింది. అయితే టీడీపీ నేతలకు ఎందుకు పదవులు రావడం లేదో మాత్రం నాకు తెలియడం లేదని’ మోత్కుపల్లి పరోక్షంగా మోడీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు.
మహారాష్ట్ర ఆడపులిగా పేరు గాంచిన మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి దారాశివ్ జిల్లాలోని…
Salman Khan has lost his cool at the paparazzi once again. This time, the incident…