
నోట్ల రద్దు కారణంగా జీడీపీ పావు నుంచి అర శాతం వరకూ తగ్గుతుందని, 2016-17లో వృద్ధి రేటు 6.5 శాతం వరకూ ఉండవచ్చన్నది ఆర్థిక సర్వే వేసిన అంచనా కాగా, వాస్తవ గణాంకాలు ఇంకాస్త తక్కువకు పరిమితం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్య నిధి సహా, ఫిచ్ వంటి రేటింగ్ సంస్థలు భారత వృద్ధి గణాంకాలను సవరించాయి. నోట్ల రద్దు తరువాత సగటు ద్రవ్యోల్బణం సైతం పెరిగింది. ప్రస్తుతం సరాసరి ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నా, వాస్తవంగా ఇంకా ఎక్కువగానే ఉంది.
ఇక ప్రభుత్వ ఖజానాకు మాత్రం నోట్ల రద్దుతో లాభం కలిగింది. డిసెంబరులో అడ్వాన్స్ పన్ను చెల్లింపులు భారీగా పెరిగాయి. మరింత మంది పన్ను చెల్లింపుల పరిధిలోకి రావడం కూడా మోడీ సర్కారు సాధించిన అసలు విజయం. కిసాన్ వికాస పత్రాలు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సుకన్య సమృద్ధి యోజన వంటి ప్రభుత్వ సేవింగ్ స్కీముల్లో చెప్పుకోతగ్గ మొత్తం పెట్టుబడులుగా వచ్చింది. కాగా, వృద్ధి రేటు తగ్గడం, ప్రజల కొనుగోలు శక్తి మందగించడంతో మోడీ చెప్పుకునే మంచి రోజులు రావడానికి మరింత సమయం పట్టవచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…