
ఓ ప్రముఖ మీడియా ప్రసారం చేసిన కధనం ప్రకారం… మోడీ హత్యకు కుట్ర జరుగుతోందని ఢిల్లీ పోలీసులకు ఫోన్ రావడం కలకలం రేపుతోంది. దినేష్ కుమార్ అనే వ్యక్తి పేరిట ఉన్న నంబర్ నుండి బుధవారం రాత్రి 11.30 నిముషాల ప్రాంతంలో ఫోన్ కాల్ రాగా, సదరు కాల్ దిల్షాద్ కాలనీ నుండి వచ్చినట్లుగా గుర్తించి విచారణ చేయగా, ఫోన్ వచ్చిన షాప్ లో ఎవరూ కనిపించకపోవడంతో, ఆ తర్వాత దినేష్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని చేసారు.
అయితే తన ఫోన్ ను బంధువులకు ఇచ్చానని చెప్పడంతో, ఆ బంధువును కూడా ప్రశ్నించగా, హోటల్ ఓ వ్యక్తి అర్జెంట్ గా ఫోన్ చేయాలని చెప్పి బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడి తనకు ఇచ్చేసాడని, ఆ వ్యక్తి ఎవరన్నది తనకు తెలియదని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే వచ్చింది ఫేక్ కాల్ అని బయటపడ్డప్పటికీ, ఎవరు కాల్ చేశారన్నది మాత్రం వెలుగు చూడలేదు. ఢిల్లీలోని స్పెషల్ సెల్ అధికారులతో పాటు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా దీనిపై విచారణ చేస్తున్నారు.
గోవా వేదికగా స్వయంగా ప్రధానే వెల్లడించడం, ఆ తర్వాత రెండు రోజులకే ఈ ఫేక్ కాల్ రావడాన్ని పోలీసు వర్గాలు తేలికగా తీసుకోవడం లేదు. ప్రధానికి సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇది కేవలం పెద్ద నోట్ల రద్దు వలన మాత్రమే జరుగుతున్న పర్యవసానాలా? లేక దుష్ట శక్తుల నుండి మోడీని ప్రాణహాని ఉందా? అన్న విషయం తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే, పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా సెక్యూరిటీ పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఈ నోట్ల వ్యవహారం సామాన్యమైన విషయం కాదన్న విషయం అర్ధమవుతోంది.
BOTTOM LINE Painfully Boring RATING 1.75/5 Story, Screenplay, Director: Nishanth Doti Cast: Shiva Kumar Kasaram,…
Nora Fatehi turns a hotel-room backdrop into her own fashion runway, bringing fearless glamour to…