
ఇది ఇలా ఉండగా టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుంది. గత బడ్జెట్ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ బానే ఉందని, అయితే చంద్రబాబును నమ్మకపోవడం వల్లే కేంద్రం నిధులు ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. తమకు 25 ఎంపీలను ఇస్తే కేంద్ర మెడలు వంచి నిధులు తెస్తామని చెప్పిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ ను నమ్మకపోవడం వల్ల నిధులు ఇవ్వలేదా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆస్థాన పత్రిక, సాక్షి తన మెయిన్ పేజీలో బడ్జెట్ ను పొగడ్తలతో ముంచెత్తింది. మోడీ ప్రొడక్షన్స్ సమర్పించు మదర్ ఇండియా అంటూ హెడ్డింగ్ పెట్టారు. మదర్ ఇండియా సినిమాలో నర్గీస్ ఐకానిక్ పోజులో ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ స్టిల్ వేశారు. ఏమి ఇచ్చారో తెలీదు గానీ రైతులకు, మహిళలకు పెద్ద పీఠ వేశారని కితాబు ఇచ్చారు. దీనితో నరేంద్ర మోడీ ప్రభుత్వం పై వైఎస్సార్ కాంగ్రెస్ వైఖరి ఎలా ఉండబోతుంది అనేది చెప్పకనే చెప్పింది సాక్షి.
భోగాపురం విమానాశ్రయానికి ఎప్పుడో ప్రారంభోత్సవం జరిగింది కదా? మళ్ళీ కొత్తగా ఈ ప్రారంభోత్సవం ఏమిటి? అనే సందేహం కలుగవచ్చు. భోగాపురం…
The Andhra Pradesh MPTC and ZPTC election process has entered the next stage, with reports…