
[m9ad]
సినిమా కధ విషయానికి వచ్చేపాటికి భూపతిరెడ్డి ఫ్యామిలీ స్టోరీగా కనపడుతోంది. భూపతిరెడ్డిగా ప్రకాష్ రాజ్ కనిపించగా, కొడుకులుగా అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబులు నటించారు. అలాగే కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ సేతుపతి కనిపించాడు. మణి కధలు ఎప్పుడూ రామాయణ, మహాభారతాల నుండే ఎంపిక చేసుకుంటారనే విమర్శ ఉండగా, ఈ కధ కూడా అందుకు తావిచ్చేదిలానే కనపడుతోంది.
ఈ సినిమాలో హీరోలు, విలన్లుగా అంతా రెడ్డి ఫ్యామిలీలోనే ఉన్నట్లుగా చూపించారు. మొత్తమ్మీద మణి ఈజ్ బ్యాక్ అనిపించే విధంగా ట్రైలర్ అంచనాలను అందుకుంది. ప్రకాష్ రాజ్ కు జతగా జయసుధ నటించగా, హీరోయిన్ల జాబితాలో జ్యోతిక, అదితిరావు, ఐశ్వర్య రాజేష్ కనిపించనున్నారు. సాంకేతిక విభాగంలో ఎ.ఆర్.రెహమాన్ సంగీతం, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్స్.
Director Boyapati Srinu has caught attention with his latest political remarks, hinting at his voting…
ఏపీ పాఠశాల విద్యాశాఖ గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి మొత్తం 2,721 పోస్టులు భర్తీ చేయబోతోంది. వీటిలో…