Telugu

ప్రేమలో పడితే ‘ప్రెస్ నోట్’ రిలీజ్ చేస్తా!

సినీ హీరోయిన్లపై ‘లవ్ ఎఫైర్స్’కు కొదవ ఉండదన్న విషయం తెలిసిందే. ఇందుకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకపోయినా… బాలీవుడ్ లో అంతా ఓపెన్ కాబట్టి, అక్కడ హీరోయిన్లపై పుకార్లు ఎక్కువగా సందడి చేస్తుంటాయి. అందులో భాగంగానే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ‘జూలీ’ ఫేం నేహాధూపియాపై కూడా పలు ప్రేమ పుకార్లు చక్కర్లు కొట్టాయి. దీంతో తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ షాక్ ఇచ్చే సమాధానాన్ని ఇచ్చింది.

ADVERTISEMENT

“ప్రస్తుతం తానెవరితోనూ ప్రేమలో పడలేదని, ఒకవేళ అలా ప్రేమలో పడితే తప్పకుండా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తానని” చెప్పి మీడియా వర్గాలను అవాక్కు చేసింది. అలా ప్రెస్ నోట్ రిలీజ్ చేసే వరకు తాను సింగిల్ గానే ఉంటానని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తన పెళ్లి గురించి బంధువులు, స్నేహితులతో పాటు అభిమానులు కూడా ప్రశ్నిస్తుంటారని, అయితే ఇప్పుడే అంత రిస్క్ తీసుకోనని, ప్రధానంగా తనకు రొమాన్స్ చేసేంత టైమ్ లేదని చెప్పుకొచ్చింది.

జిమ్ లో ఉన్నప్పుడు లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు మాత్రమే ఖాళీగా ఉంటానని… అందుకే తన పార్టనర్ ను జిమ్ లో లేదా విమానంలో వెతుక్కుంటానేమోననిపిస్తుందని ఫైనల్ గా చలోక్తులు విసిరి మీడియా వర్గాలను శాంతింపచేసింది. సిల్వర్ స్క్రీన్ అందాల ఆరబోత చేసే ఈ ముద్దుగుమ్మ, మాటలలో కూడా తూటాలను బాగానే పేలుస్తుందని అనుకోవడం మీడియా వర్గాల వంతయ్యింది. ఇదే తరహా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి చెప్పి ఉన్న ముద్దుగుమ్మలు ఒక్కోసారి ఇలా ‘బరస్ట్’ అవ్వడం సర్వసాధారణమే!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

OG Universe Update: Sujeeth Teases Small Treat

Pawan Kalyan’s birthday celebrations are getting another update from the team of OG. Director Sujeeth…

11 minutes ago

Toxic Tuesday Figures Raise Fresh Concerns

Toxic is slowing down at the box office, and Tuesday’s numbers have added to the…

21 minutes ago