
తన సోదరి అయేషా శర్మతో కలిసి హాట్ హాట్ ఫోటోలను, వీడియోలను అప్ లోడ్ చేసే నేహా, తాజాగా కూడా తన సోదరీమణితో కలిసి గోవాలో చేసిన సందడి యొక్క ఫోటోలను, వీడియోలను అప్ లోడ్ చేసింది. ఇందులో టూరింగ్ స్పాట్ లొకేషన్స్ కంటే కూడా నేహా శర్మ అందాల విందే ఎక్కువగా ఫోకస్ అయ్యేలా పోస్ట్ చేయడం గమనించదగ్గ విషయం.
ఫాలోయర్స్ ను పెంచుకునే క్రమంలో బాలీవుడ్ బ్యూటీలు ఇలా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులు మరియు అందాల విందు చేయడం చాలా సహజంగా మారిపోయింది. ఇలాగే సినిమాలకు దూరమైన మరో బ్యూటీ ఈషా గుప్తా కూడా తన సిజ్లింగ్ ఫోటోషూట్ లతో ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ ను అమాంతం పెంచుకున్న విషయం తెలిసిందే.
చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో నెట్టుకొస్తున్న ఈ బ్యూటీలకు ఇంస్టాగ్రామ్ ఓ వేదికలా మారినట్లు ఉంది. ఒకప్పుడు ఫోటోషూట్ల ద్వారా దర్శకనిర్మాతలకు తమ భావాలను తెలియజేసే బ్యూటీలకు ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ద్వారా సందేశాలు పంపుతున్నట్లు అవుతోంది. ఓ పక్కన ఫాలోయర్స్, మరో పక్కన చెదురుమదురు అవకాశాలు… ప్రస్తుత బ్యూటీల టార్గెట్..!
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…
A H-1B tech worker's post on Reddit, where she plans for the future amidst layoffs…