“నేను… శైలజ…” ట్రైలర్ టాక్ – పోలా… అదిరిపోలా..!

nenu sailaja trailer gets good responseఇటీవల కాలంలో విడుదలైన సినిమా ట్రైలర్లలో చూడగానే మళ్ళీ చూడాలనిపించే ట్రైలర్ ఏమైనా వచ్చిందంటే… అది ఖచ్చితంగా రామ్ నటించిన “నేను… శైలజ…” ట్రైలరేనని చెప్పవచ్చు. అలాగే చాలా కాలం తర్వాత ఓ పూర్తి ప్రేమకధాచిత్రం తెలుగు తెరపై ప్రదర్శితమవుతోంది. రామ్ సెటిల్డ్ అభినయం, హీరోయిన్ కీర్తి సురేష్ లుక్స్, దేవిశ్రీప్రసాద్ సంగీతం, సందర్భానికి అనుగుణంగా వచ్చే డైలాగ్స్… “నేను… శైలజ…” ట్రైలర్ లోని హైలైట్స్.

ఫస్ట్ లుక్ నుండి ఇప్పటి ట్రైలర్ వరకు సినిమాపై ఆసక్తిని పెంచడంలో చిత్ర యూనిట్ సూపర్ సక్సెస్ అయ్యింది. ట్రైలర్ చివరలో కూడా కీర్తి సురేష్ సన్నివేశంతో ఇచ్చిన ముగింపు సినిమాపై క్యూరియాసిటిని పెంచింది. అలాగే పాటలకు సంబంధించిన టీజర్స్ కూడా “నేను… శైలజ…”పై పాజిటివ్ సంకేతాలను అందించాయి. మరోసారి దేవి తన మ్యూజికల్ మార్క్ ను అందించినట్లుగా స్పష్టమవుతోంది. వినసొంపైన దేవిశ్రీ బాణీలు “నేను… శైలజ…”కు మరో హైలైట్ గా నిలవబోతున్నాయి.

ADVERTISEMENT

శ్రీస్రవంతి మూవీస్ పై నిర్మించిన ఈ చిత్రానికి తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం కానుకగా విడుదల కాబోయే “నేను… శైలజ…” చిత్ర ట్రైలర్ వీక్షకుల కోసం…

ADVERTISEMENT
Latest Stories