
ఎప్పుడు మనం హాలీవుడ్ సినిమాలనో లేక మిగతా ఫారిన్ భాషా చిత్రాలను కాపీ కొట్టడమో లేక ఇన్స్పైర్ అవ్వడమో చూస్తుంటాం. కానీ.. హాలీవుడ్ మన తెలుగు సినిమాను కాపీ లేదా ఇన్స్పైర్ అవ్వడం మాత్రం చాలా అరుదు. గోపీచంద్ “ఒక్కడున్నాడు” చిత్రాన్ని హాలీవుడ్ అఫీషియల్ గా రీమేక్ చేసింది. ఎస్వీ కృష్ణారెడ్డి కూడా తన “ఆహ్వానం” చిత్రాన్ని హాలీవుడ్ లో “డివోర్స్ ఇన్విటేషన్” అంటూ ఆయనే స్వయంగా రీమేక్ చేసారు. ఇలా తెలుగు సినిమాలు హాలీవుడ్ లో అడపాదడపా రీమేక్ అవుతూనే ఉన్నాయి. రీసెంట్ గా మాత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఓ వెబ్ ఫిలిం అందరికీ మన పాపులర్ తెలుగు సినిమాని గుర్తు చేసింది.
విషయం ఏంటంటే.. నెట్ ఫ్లిక్స్ లో గతవారం విడుదలైన “లేడీస్ ఫస్ట్” అనే వెబ్ ఫిలింకి పెద్దగా ఆదరణ లభించలేదు. అసలా సినిమా ఒకటి వచ్చినట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ కూడా పెద్దగా పబ్లిసిటీ చేయలేదు. అయితే.. చూసిన అతికొద్ది మాత్రం “ఈవీవీ ఇలాంటి సినిమా ఎప్పుడో తీశారు” అని సోషల్ మీడియాలో కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఈవీవీ కాన్సెప్ట్ ఏమిటబ్బా అని చూడడం స్టార్ట్ చేసిన కొంతమందికి మొదటి 15 నిమిషాలకే క్లారిటీ వచ్చేసింది ఈ “లేడీస్ ఫస్ట్” అనేది మన “జంబ లకిడి పంబ”కు లేటెస్ట్ వెర్షన్ అని.
ఓ కంపెనీ సీఈఓ తన టీమ్ కి మహిళలకు అస్సలు ప్రాధాన్యత ఇవ్వడు, కంపెనీ పాలసీ కోసం ఒక అమ్మాయిని టీమ్ లో పెట్టుకున్నా.. ఆమె ఇచ్చే ఐడియాని ఖాతరు చేయడు. దాంతో ఆమె వెంటనే రిజైన్ చేసి కంపెనీ నుండి వెళ్ళిపోయే తరుణంలో.. ఒకరితో ఒకరు గొడవపడుతూ.. సీఈఓ పాత్రధారి కాలు జారి కిందపడతాడు, లేచేసరికి తన చుట్టూ ప్రపంచం మొత్తం ఆడవాళ్ల దృష్టికోణంలో కనిపించడం మొదలవుతుంది. మగాళ్ల మీద ఆడాళ్ళు డామినేట్ చేస్తే ఎలా ఉంటుంది? మగాళ్లు ఆడవాళ్లలా, ఆడవాళ్లు మగవాళ్ళలా బిహేవ్ చేస్తూ.. సెక్సువల్ ఫేవర్స్ తో ఇబ్బంది పెట్టడం గట్రాలు అన్నీ ఈ నెట్ ఫ్లిక్స్ ఫిలింలో ఉన్నాయి. కాన్వాస్ మారింది కానీ.. ఇదంతా నిజంగానే ఈవీవీ ఎప్పుడో చూపించేశారు అన్నట్లుగానే ఉంది.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…