Telugu

జూన్ 2న ‘ఏపీ’ని దాటబోతున్న ‘తెలంగాణా!’

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణాలో 10 జిల్లాలు.., ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే రెండు రాష్ట్రాల్లోనూ జిల్లాల సంఖ్యను పెంచే ప్రతిపాదనలు చేసాయి. ఏపీలో ఉన్న ఆర్ధిక భారం రీత్యా ఈ ఆలోచనను ప్రస్తుతం కార్యరూపం సిద్ధించలేని పరిస్థితి నెలకొంది. అయితే తెలంగాణాలో మాత్రం రాబోతున్న జూన్ 2వ తేదీ నుండి ఏపీ కంటే దాదాపు రెట్టింపు సంఖ్యలో జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రంగం సిద్ధం చేసారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద జిల్లాల కారణంగా అంచనాలు వేసిన స్థాయిలో తెలంగాణ అభివృద్ధి దూసుకుపోవడం లేదని భావించిన సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు వైపుకు మొగ్గు చూపారు. తాజాగా జరిపిన సమీక్ష సమావేశంలో సీఎస్ కు పలు సూచనలు చేసిన కేసీఆర్, తెలంగాణాలోని జిల్లాల పెంపుపై రాష్ట్ర విభజన రోజు అయినటువంటి జూన్ 2న ఒక ప్రకటన చేస్తామని తెలిపారు.

ADVERTISEMENT

తెలంగాణలో మొత్తం 24 లేక 25 జిల్లాలు ఉండనున్నాయని, ఇప్పుడున్న మండలాలకు తోడు మరో 40 మండలాలను కూడా ఏర్పాటు చేయనున్నామని అన్నారు. 8 నుంచి 10 మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని, కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై కార్యాచరణ వెంటనే రూపొందించాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాజకీయ నాయకులు కూడా మిక్కిలి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకో తెలుసుగా…!

Share
Siddartha Toleti

With over a decade of experience as a movie reviewer, Siddhartha (pen name) brings in-depth analysis and insights to every review. Passionate about films and TV series across all languages, Siddhartha primarily focuse…

Published by

Recent Posts

Toxic Creates History: Two Times Disaster in Single Week?

Toxic has emerged as a big disaster at the box office. Despite taking a huge…

25 minutes ago

Mirzapur: OTT Star Not Coming Out of Panchayat Hangover?

Mirzapur The Film has finally arrived in theatres after a long wait. The popular franchise,…

55 minutes ago