2024 ఫైనల్ కిక్ గా ‘M9’ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నలుగురు యువ నిర్మాతలు బన్నీ వాస్, హర్షిత్ రెడ్డి, చెరుకూరి సుధాకర్, గారపాటి సాహులు టాలీవుడ్ ప్రస్తుతం నిర్మాతలు ఎదుర్కొంటున్న పరిస్థితుల నుండి భవిష్యత్తులో రాబోయే క్రేజీ ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా నందమూరి అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తోన్న అప్ డేట్ గురించి నిర్మాత సుధాకర్ చెప్తూ, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ప్రశాంత్ వర్మ – మోక్షజ్ఞ ప్రాజెక్ట్ ఆగిపోలేదని, జనవరిలో అధికారికంగా మొదలు కాబోతోందని, కొన్ని కారణాల వలన ఆలస్యం అయ్యిందే తప్ప, ఈ ప్రాజెక్ట్ నుండి ప్రశాంత్ వర్మ లేరంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు.
ఇదే సమయంలో మెగా ఫ్యాన్స్ కు కూడా ప్రొడ్యూసర్ సుధాకర్ ఓ క్రేజీ అప్ డేట్ ను ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి – ఓదెల శ్రీకాంత్ కాంబోలో ఓ ప్రయోగాత్మక సినిమా తెరకెక్కబోతోందని, ఇప్పటివరకు మెగాస్టార్ చేయని రేంజ్ లో ఉండబోతుందని, ఈ సినిమాలో హీరోయిన్, పాటలు ఉండబోవడం లేదని జరుగుతున్న ప్రచారంపై స్పష్టత లేదని, కధ పూర్తి స్థాయిలో సిద్ధం కావాల్సి ఉందని అన్నారు.
మెగాస్టార్ చిరు – అనిల్ రావిపూడి కాంబోలో వింటేజ్ చిరంజీవి తరహాలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నామని మరో నిర్మాత గారపాటి సాహు చెప్పుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ‘మైథలాజికల్ మూవీ’ ఓ సెన్సేషన్ అవుతుందని, ఇప్పటివరకు త్రివిక్రమ్ గారు దర్శకత్వం వహించిన సినిమాలలో ‘బెస్ట్’గా ఉండబోతుందన్న మాటలను అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఇచ్చారు బన్నీ వాస్.
‘గేమ్ చేంజర్’ సినిమాను ఇంకా తాను చూడలేదని, కానీ దిల్ రాజు గారు ఇప్పటికే సినిమాను చూసారని, ఆయన తీరు చూస్తే ‘గేమ్ చేంజర్’ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారని, 2025 ఓ పాజిటివ్ నోట్ తో ప్రారంభించబోతున్నామని నిర్మాత హర్షిత్ రెడ్డి మెగా ఫ్యాన్స్ కు కావాల్సిన కిక్ ని అందించారు.
Anukreethy Vas makes a simple lace and denim pairing feel like a proper fashion moment.…
Today, Prime Minister Narendra Modi inaugurated the Vadapalani to Poonamallee stretch of the Phase 2…