
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎదురుచూశామని అయితే బడ్జెట్‌లో హోదా ప్రస్తావనే లేదన్నారు.”మా ప్రభుత్వం ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది. వ్యవసాయంపై ఆధారపడి ఉన్న ఏపీకి బడ్జెట్ నిరుపయోగం. పోలవరాన్ని ఆలస్యం చేయొద్దు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనడంలో స్పష్టత లేదు. ద్రవ్యోల్బణం పెరగడం మంచి పరిణామం కాదు. రాష్ట్రాలపై కేంద్రం పక్షపాత ధోరణి చూపించకూడదు’ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
అయితే దీనిపై విజయ సాయి రెడ్డి సోషల్ మీడియాలో తీవ్ర నిరసన ఎదురుకుంటున్నారు. “అసలు ప్రత్యేక హోదా కోసం మీ ప్రభుత్వం ఏం ప్రయత్నం చేసిందని మీరు రాలేదని నిరాశపడుతున్నారు. కనీసం ప్రయత్నం చెయ్యకుండా మీ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిన మొదటి సారే మోడీ కి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి ఏం చెయ్యలేము అని చేతులెత్తేసిన మాట వాస్తవం కాదా?,” అని వారు ప్రశ్నిస్తున్నారు.
“ప్రత్యేక హోదా గురించి కనీసం ప్రస్తావించారా మీరు? పార్లమెంట్ లో ఆ విషయాన్ని ఎప్పుడైనా అడిగారా? ప్రతీ విషయంలో కేంద్రం అడుగులకు మడుగులు ఒత్తి ఇప్పుడు ఏమీ తేలినట్టు నెపం బీజేపీ మీద వేస్తున్నారా?,” అంటూ చాలా మంది విమర్శిస్తున్నారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టించాయనే చెప్పాలి. తెలంగాణ…
South India has this strong hero worship culture, be it cinema or politics. The kind…