
‘అజ్ఞాతవాసి’ కథ విషయంలో త్రివిక్రమ్ సరిగ్గా దృష్టి పెట్టలేదనే విమర్శలు వచ్చాయి. ఇదంతా ఒకెత్తు అయితే కాపీ అన్న విషయం తేటతెల్లమైంది. అలాగే అంతకుముందు నితిన్ తో తీసిన ‘అ… ఆ…’ కూడా నవలకు కాపీ అందించారు. ఈ కారణంగా నితిన్ సినిమాకి ఆయన అందించిన కథా నేపథ్యం గురించే ట్రేడ్ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకి త్రివిక్రమ్ అందించిన కథ రొమాంటిక్ డ్రామాగా కొనసాగుతుందనేది తాజా సమాచారం. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా ఈ కథ ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 12 న టైటిల్ ను ఖరారు చేసి .. 14న టీజర్ ను రిలీజ్ చేసి .. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Pawan Kalyan’s birthday is almost here, and OG 2 is naturally one of the projects…
Prabhas has reached a point where the problem is no longer finding big films. It…