మహేష్ బాబు సేఫ్!

Mahesh babu, nithin, a aa, mahesh srimanthudu, trivikram Movie, US Collections, A Aa Movie Collections, Samantha A aa Movie, A aa Movie records   ఇటీవల విడుదలైన త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ ల ‘అ…ఆ…’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణాలతో పాటు యుఎస్ లోనూ కనకవర్షం కురిపించిన ‘అ…ఆ…’ దెబ్బకు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల రికార్డులు పటాపంచలు అయ్యాయి. ఆల్ టైం జాబితాలో ప్రస్తుతం టాప్ 3లో ఉన్న ‘అ…ఆ…’ సినిమా, రెండవ స్థానంలో ఉన్న మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమాకు కూడా ఎర్త్ పెడుతుందన్న అంచనాలు ట్రేడ్ వర్గాల నుండి వ్యక్తమయ్యాయి.

బుధవారం వరకు ఉన్న కలెక్షన్స్ ను పరిశీలిస్తే దాదాపు 2.30 మిలియన్ డాలర్లను వసూలు చేసి, 2.50 మిలియన్ డాలర్ల లక్ష్యంగా పరుగులు పెడుతోంది. అయితే, ఈ వీక్ లో కలెక్షన్స్ కాస్త నెమ్మదించడంతో, ‘అ…ఆ…’ మొత్తమ్మీద 2.50 మార్క్ ను టచ్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రెండు వారాలు పూర్తయ్యి, మూడవ వారంలో అడుగు పెట్టడంతో యుఎస్ మార్కెట్ లో సంచలనాలు నమోదయ్యే అవకాశం లేదని సినీ విశ్లేషకులు వ్యక్తపరుస్తున్న భావన. దీంతో రెండవ స్థానంలో 2.87 మిలియన్ డాలర్లతో ఉన్న ‘శ్రీమంతుడు’ రికార్డులు పదిలంగానే ఉంటాయని చెప్పవచ్చు.

ADVERTISEMENT

అయితే ‘శ్రీమంతుడు’ రికార్డు కూడా కొల్లగోడితే… ‘మాటల మాంత్రికుడు’ అగ్ర హీరోలందరికీ ఓ ఛాలెంజ్ విసిరినట్లుగా భావించవచ్చు. ఒకవేళ రికార్డు కొట్టకపోయినా… ఇప్పటికీ అగ్ర హీరోల ప్రభావం కంటే, తన స్థాయే ఎక్కువని త్రివిక్రముడు నిరూపించుకున్నాడు. ఏది ఏమైనా పవన్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ రికార్డులను దాటుకుని రెండవ స్థానంలో నిలబడితే, ఒక హీరోగా నితిన్ కు వచ్చే ‘కిక్కే’ వేరు కదా!

ADVERTISEMENT
Latest Stories