
దేశంలో మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్నా గానీ, తెలంగాణకు కేంద్రం విశేషంగా నిధులు మంజూరు చేస్తోందని, హైదరాబాద్‌ను వైఫై సిటీగా చేసేందుకు సిద్ధంగా ఉందని, హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సాయం అవసరముందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైల్ ప్రారంభోత్సవం తేదీని ప్రకటిస్తే ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీని తీసుకువస్తామని, అయితే పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయని, అలాగే రాష్ట్రంలో 5 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులకు ప్రతిపాదనలు పంపాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాన్ని అడిగిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి సమాధానం కొరవడిందని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు.
రాబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్ కేంద్రంగా పలు అభివృద్ధి పధకాలపై దృష్టి మరల్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణాలో ఎలాగైనా పట్టు సాధించేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ భారీ ప్యాకేజీ ప్రకటన అని విశ్లేషిస్తున్నారు.
కేసీఆర్ త్వరలోనే తన ఫామ్ హౌస్ అజ్ఞాతానికి శుభం కార్డు వెయ్యనున్నట్టుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆదివారం జరిగిన బిఆర్ఎస్…
Telangana Assembly sessions are rarely short of political drama, but today’s developments have taken the…