
నగరంలో మొత్తం అన్ని బ్యాంకుల ఏటీఎంలు కలిపి 4,520 ఉండగా, వీటిలో 15 శాతం పూర్తిగా మూతపడ్డాయి. ప్రైవేటు బ్యాంకులు తమ ఏటీఎంలను తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు ఓ అధికారి తెలిపారు. క్యాష్ లెస్ విధానంలో భాగంగానే బ్యాంకులు ఈ చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు బ్యాంక్ అసోసియేషన్ నాయకులు అంటున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్బీఐ కొత్త నోట్లను బ్యాంకులకు సరఫరా చేయడాన్ని నిలిపివేసిందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో భాగ్యనగరం కాస్త ‘క్యాష్ లెస్’ నగరంగా మారిపోయిందని చలోక్తులు విసురుతున్నారు.
పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త 100, 50 నోట్లను అందుబాటులోకి తీసుకు రాలేదని చెబుతున్నారు. మరోవైపు ఏప్రిల్ 1 తర్వాత ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణపై మళ్ళీ పరిమితులు విధిస్తారని, ఏటీఎంలు కూడా చాలావరకు మూతపడతాయనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ పరిస్థితికి కారణం మాత్రం బ్యాంకులు అమలు చేస్తున్న నియమ నిబంధనలు మరియు రోజుకో కొత్త నిర్ణయంతో కేంద్రం చేస్తున్న ప్రకటనలు ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
Allari Naresh knows exactly what he wants from the audience this time that's laughter, not…
There is some fresh buzz around Chiranjeevi and Bobby Kolli’s Kaaka. According to industry gossip,…