
రెండు దశాబ్దాల పాటు తెలుగు ఇండస్ట్రీని ఏకచ్చాత్రాధిపత్యంగా ఏలిన మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చరణ్ మాత్రం చిరు వారసత్వాన్ని ఉపయోగించుకుని అవకాశాలు పొందుతున్నారు కానీ నటనలో ఆయన వారసత్వాన్ని నిలుపుకోలేకపోతున్నారు అని సినీ విమర్శకుల అభిప్రాయం. చెర్రీ నటించిన రెండవ సినిమా “మగధీర’’తో అప్పటి ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టినా… ఆ విజయంలో సింహభాగం దర్శకుడు రాజమౌళికే దక్కింది. అయితే అది తప్పు అని నిరూపించుకునే విధంగా మళ్ళీ చరణ్ ఆ స్థాయి విజయాన్ని అందిపుచ్చుకోకపోవడంతో, ఆ వాదనకు మరింత బలం చేకూరింది.
“నాయక్, ఎవడు” చిత్రాలతో కొంతమేరకు మెప్పించినా, చెర్రీ స్థాయిని పెంచే విజయం రాలేదనే చెప్పాలి. ‘బ్రూస్ లీ’ సినిమాతో ఫ్లాప్ ను తన ఖాతా లో వేసుకుని ఈ సారి డబ్బింగ్ బొమ్మతో తన అదృష్టాన్ని పరీక్షించు కోవాలనుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మరో వారసుడు వరుణ్ తేజ్ కూడా మూడు సినిమాలు చేసినా ఒక్క కమర్షియల్ హిట్ సాధించలేకపోయారు.
మెగా ఫ్యామిలీ తర్వాత వారసత్వంలో ఎక్కువ భాగం ‘అక్కినేని’ ఫ్యామిలీదే అని చెప్పాలి. నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమై, చాలా కాలమైనా ఒకటి, రెండు సినిమాలు మినహా పెద్దగా మాయ చేయలేకపోయాడు నాగ చైతన్య. ఇక, అఖిల్ కూడా తన లాంచింగ్ మూవీని పరాజయంతోనే మొదలుపెట్టారు. ఇండస్ట్రీ పైనే కాక సినీప్రేక్షకుల మీద హిట్ల కోసం దండయాత్రలు చేస్తున్న వారిలో “మంచు’’ వారసులు ఉన్నారు. మంచు ఫ్యామిలీ నుండి ముగ్గురు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు కానీ ఒక్కరు కూడా తండ్రి మోహన్ బాబుకు విజయ గర్వాన్ని ఇవ్వలేకపోయారు.
ఇక, ఇ.వి.వి. తనయుడిగా పరిచయమయిన అల్లరి నరేష్ మొదట్లో ఇండస్ట్రీలో చేసిన ‘అల్లరి’ అంతా ఇంతా కాదు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఒక్క హిట్ కొట్టలేక అల్లరి పాలవుతున్నాడు. వీరు కాక, సుశాంత్, శిరీష్ వంటి వారి జాబితా లెక్కిస్తే… చాంతాడంత అవుతుంది. ఇలా ‘వారసత్వం’ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయిన వారంతా హిట్ కోసం ఆశగా ప్రేక్షకుల వైపుకు చూస్తున్నారు.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…