Telugu

అసలు మేకప్ అంటూ లేని స్టార్ సినిమా

రానా దగ్గుబాటి యొక్క విరాటపర్వం షూటింగ్ ఐదు రోజుల పని మినహా అన్నీ పూర్తయ్యాయి. ఈ చిత్రం లేట్ సమ్మర్‌ను విడుదల చేయాల్సి ఉంది, కాని కరోనా వ్యాప్తి అది జరగలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదు. ఈ చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల ఒక ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించారు.

ADVERTISEMENT

ఈ చిత్రంలో నటులు ఎవరూ మేకప్ వేసుకోలేదని ఆయన వెల్లడించారు. తెలుగు సినిమాలో అది కూడా స్టార్ హీరోల సినిమాలలో ఇది చాలా అరుదైన విషయం. 1992 నాటి గ్రామీణ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ఈ సినిమా రూపొందబోతున్నట్టు తెలుస్తోంది. మార్క్సిజం భావాల ప్రభావితంతో నక్సలైట్‌గా మారిన అమ్మాయిగా కనిపించబోతోంది సాయి పల్లవి.

దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయం నుంచి 1992 దాకా గ్రామస్థాయి రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే విభిన్న కథను తీసుకున్న వేణు ఉడుగుల ఈ స్క్రిప్టు పై పెద్ద గ్రౌండ్ వర్కే చేశారట. నక్సలైట్ ప్రభావిత గ్రామంలో రాజకీయాలు చేసే పంచాయితీ వార్డ్ మెంబర్‌గా రానా దగ్గుపాటి కనిపించబోతున్నాడు.

సోలో హీరోగా రానాకు అవకాశాలు తక్కువ, విజయాలు తక్కువే. 2017 తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో సోలో హీరోగా తన కేరీర్ లోనే పెద్ద హిట్ అందుకున్నాడు రానా. ఇప్పుడు ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఈ సినిమా విడుదల కోసం దగ్గుబాటి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

ఈ స్థానిక మంటలతో చలి కాగాలనుకుంటే…

పాలకులు అవినీతికి పాల్పడుతుంటే ఆ దేశం, రాష్ట్రాలు, ప్రజలు తీవ్రంగా నష్టపోతుంటారు. అదే.. రాజకీయ పార్టీలు నైతిక విలువలు వదిలేస్తే,…

8 minutes ago

Brutal Trolls, Image Killed, But NTR Silent!

Social media is breeding ground for trolls and wild stuff and it has been the…

21 minutes ago