సెంటిమెంట్ పక్కన పెట్టిన ‘పవర్ స్టార్’

వరుస ప్లాప్ లతో సతమతమవుతూ ఖచ్చితంగా సక్సెస్ కావాల్సిన తరుణంలో… 2012 మే 11వ తేదీన విడుదలైన “గబ్బర్ సింగ్” పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అభిమానులకు కూడా కావాల్సినంత ఎంజాయ్ మెంట్ ను ఇచ్చింది. దీంతో సక్సెస్ సెంటిమెంట్ గా మారిన మే 11వ తేదీనే ఆ సినిమా సీక్వెల్ “సర్ధార్ గబ్బర్ సింగ్”ను కూడా విడుదల చేయబోతున్నారని ఇటీవల వార్తలు హల్చల్ చేసాయి.

అయితే తాజా సమాచారం మేరకు అలాంటి సెంటిమెంట్లకు తావు లేకుండా వీలైనంత ముందుగా సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుందట. ఏప్రిల్ చివరి వారంలో గానీ, మే మొదటి వారంలో గానీ “బ్రహ్మోత్సవం” విడుదల షెడ్యూల్ ఉండడంతో, పోటీకి పోకుండా సమ్మర్ ను క్యాష్ చేసుకోవాలనే తలంపుతో ఏప్రిల్ 8వ తేదీకే సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT

జనవరి 4వ తేదీతో ప్రారంభం కాబోయే తాజా షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. దీంతో సినిమా పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించి మార్చిలో ఆడియోను, ఏప్రిల్ లో వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారని సమాచారం. ఇదే అధికారిక వార్త అయితే పవర్ స్టార్ అభిమానులకు అంతకు మించిన ఆనందం ఉంటుందా?

Share
Published by

Recent Posts

Dilwali Diwali Review: Template Festive Fare, Just Bearable

BOTTOM LINE Template Festive Fare, Just Bearable PLATFORM Netflix RUNTIME 1Hour 1 Min What Is…

2 minutes ago

Film Event Gets Political Vibe, But Why?

South India is witnessing a wave of film stars entering politics and tasting tremendous success.…

16 minutes ago