
పెద్ద నోట్ల రద్దు ప్రకటన తరువాత ఇండియాకు వచ్చి యుద్ధ ప్రాతిపదికన పనిలోకి దిగిన రితురాజ్, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో వెల్లడించారు. నోట్లు రద్దయ్యాయి అని తెలియగానే, అసలు పని మాపైనే ఉందని గుర్తించాం. అదనపు సిబ్బందిని నియమించుకుని తొలుత ఏటీఎంలలోని నగదును తీసుకువచ్చాం. బ్యాంకులు కేవలం 100 నోట్లను మాత్రమే ఏటీఎంలలో నింపేందుకు అనుమతిచ్చింది. వాస్తవానికి ఒక్కో ఏటీఎంలో నగదును అమర్చే అరలు నాలుగు ఉంటాయి.
వాటిల్లో ఒకటి 1000 రూపాయల నోట్లకు, రెండు 500కు, మరొకటి 100 రూపాయల నోట్లు పెట్టేందుకు అనువుగా తయారు చేయబడ్డాయి. ఒక్కో అరలో 3 వేల నోట్లు మాత్రమే పడతాయి. ఒక డినామినేషన్ కు కేటాయించిన అరలో ఆ నోట్లు మాత్రమే పెట్టాలి. ఇక ఎంతగా పెట్టినా, ఒకసారి ఏటీఎంను నింపితే, 100 నోట్లను మూడు వేల వరకు మాత్రమే పట్టగలం, అంటే 3 లక్షల వరకూ మాత్రమే 100కు కేటాయించిన అరలో నింపడానికి అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఒక్కొక్కరు 2 వేల చొప్పున విత్ డ్రా చేసుకుంటుంటే, కేవలం 150 మందికి మాత్రమే ఆ డబ్బు సరిపోతుంది. ఆపై వచ్చే వారు మళ్ళీ తిరిగి ఏటీఎంను నింపే వరకూ వేచి చూడాల్సిందే… ఇది అసలు కారణం అంటూ రితురాజ్ సిన్హా వెల్లడించారు. ఏటీఎంలను కొత్త 2 వేలు, 500 నోట్లను అనుగుణంగా అప్ డేట్ చేయలేకపోవడంతో, కేవలం 100 రూపాయల నోట్లను మాత్రమే అమరుస్తున్న విషయం తెలిసిందే.
Varun Dhawan’s films have not worked big at the box office over the last few…
BOTTOM LINE Painfully Boring RATING 1.75/5 Story, Screenplay, Director: Nishanth Doti Cast: Shiva Kumar Kasaram,…