Telugu

‘అవార్డుల’ విషయంలో ఇక రికమండేషన్లు ఉండవ్..!

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించే ‘పద్మ’ అవార్డుల విషయంలో ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్న విషయం తెలిసిందే. రాజకీయ పలుకుబడి, అండదండలు ఉన్న వారినే ఈ అవార్డులు వరిస్తాయనే నానుడి దేశవ్యాప్తంగా వ్యక్తమైంది. అయితే ఇవేమీ ఒట్టి పుకార్లు కావు. ఇలాంటి అభిప్రాయాలు కలిగిలా ఆయా ప్రభుత్వాలలో ‘పద్మ’ అవార్డులు కొందరికి దక్కాయి. అయితే ఇక నుండి ఇలాంటి రాజకీయాలతో కూడిన అవార్డులకు కేంద్రం ప్రభుత్వం స్వస్తి పలకనుంది.

ADVERTISEMENT

‘పద్మ’ అవార్డు గ్రహీతలను ఇక నుండి ప్రజలే నిర్ణయించనున్నారు. అర్హులను కూడా వారే నామినేట్ చేస్తారు. ఈ మేరకు కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. సమాజానికి సేవలందించిన, విజయాలు సాధించి పెట్టిన వారి పేర్లను ఇక నుంచి ప్రజలే నేరుగా నామినేట్ చేసే అవకాశం కల్పించింది. పైరవీలకు తావు లేకుండా, అవార్డుల ఎంపికలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ కోటా కింద పద్మ పౌర పురస్కారాల కోసం సిఫార్సులు చేస్తూ అర్హుల పేర్లతో కూడిన జాబితాను పంపించిన తర్వాత, కేంద్రం తుది నిర్ణయం తీసుకుని భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటిస్తుంది.

అయితే ఇక నుంచి ప్రతి భారతీయ పౌరుడూ ఈ నామినేషన్‌లో పాలుపంచుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం పేర్కొన్న విధంగా ఆన్‌లైన్‌లో అర్హుల పేర్లను నామినేట్ చేయాల్సి ఉంటుంది. అయితే నామినేట్ చేసే వారు తమ ఆధార్ వివరాలను పేర్కొనాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా అర్హులు అనిపించిన వ్యక్తుల పేర్లను నామినేట్ చేయవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. నామినేషన్‌ కు ఈనెల 15 చివరి తేదీ కాగా ఇప్పటికే 1700 నామినేషన్లు వచ్చాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Nabha Natesh Turns Traditional Glam Into Bold Mood

Nabha Natesh turns classic Indian glamour into a striking fashion statement with this fiery rust…

13 minutes ago

200-Episode BIG Gamble: Is YouTube Replacing Indian TV?

Ekta Kapoor is taking a major gamble with Balaji Telefilms, and this time, television is…

43 minutes ago