Telugu

ఎన్టీఆర్ డౌన్ ఫాల్ – నాగార్జున టు చిరంజీవి!

తెలుగునాట సంచలనంగా ప్రారంభమై, టీఆర్పీ లలో కనివినీ ఎరుగని రికార్డులను సొంతం చేసుకున్న ‘బిగ్ బాస్’ షో, క్రమంగా ప్రేక్షకుల ఆదరణను కోల్పోతున్నట్లుగా కనపడుతోంది. వీకెండ్ లో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డంతో ఇస్తున్న రెండు రోజుల ఊపును, ఆ తర్వాత హౌస్ కొనసాగించడంలో విఫలమవుతుందనేది లేటెస్ట్ న్యూస్. నిజానికి ఈ షో ప్రారంభం ముందు వరకు… ‘బిగ్ బాస్’ అనేది జూనియర్ ఎన్టీఆర్ కు ఫ్యామిలీ ప్రేక్షకులను దగ్గర చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనుకున్నారు, కానీ ప్రస్తుతం ఈ షోకు తారక్ ఉపయోగపడుతున్నారు.

ADVERTISEMENT

అయితే ఇంతలా డౌన్ ఫాల్ కావడానికి కారణం ఏమిటంటే… బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పార్టిసిపెంట్స్ ఎంపికే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ‘బిగ్ బాస్’ పాపులర్ కావడానికి, ఆయా షోలలో మహిళా తారామణులు ప్రదర్శించిన గ్లామర్ సోయగాలే. ప్రస్తుతం తెలుగు ‘బిగ్ బాస్’ మాత్రం అందుకు విరుద్ధంగా… ఫ్యామిలీ డ్రామాలతో కొనసాగుతుండడం విశేషం. తెలుగు నేటివిటికి సహజంగా అయితే ఉంది గానీ, అదే సీన్లు నిత్యం ఇళ్ళల్లో చూస్తున్న వారికి ఇలాంటి సీన్లు ఒక రకంగా విసుగు తెప్పిస్తున్నాయి.

వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన దీక్షా పంత్ కు తోడు మరో ఒకరిద్దరు హాట్ బొమ్మలను హౌస్ లోపలికి పంపిస్తే తప్ప, ‘బిగ్ బాస్’కు తొలినాళ్ళల్లో దక్కిన ఆదరణ మళ్ళీ లభిస్తుంది. లేదంటే… నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రారంభమైన ‘బిగ్ బాస్’ రేంజ్, మెగాస్టార్ చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రేంజ్ కు పడిపోతుందనేది ప్రస్తుతం వస్తున్న హెచ్చరికలు. మళ్ళీ వీకెండ్ వస్తుంది కాబట్టి ఈ షో నుండి మరొకరు బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది గనుక, మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి కూడా అవకాశం లభించినట్లే..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఇది ఆంధ్రా ప్రజల ఉసురా.. బీఆర్ఎస్‌ కర్మ ఫలమా?

నాడు సిఎం చంద్రబాబు నాయుడు అమరావతికి శ్రీకారం చుట్టి, పోలవరం పనులు పరుగులు పెట్టిస్తుంటే, తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఆయనను…

6 minutes ago

Action Or Warning? Konda Surekha In Spotlight

The Congress party is historically famous for leading group politics. There is very little dirty…

26 minutes ago