
ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కనున్న సినిమాలో ‘ఎన్టీఆర్’ పాత్రలో తానే నటిస్తానని మరింత స్పష్టత ఇచ్చారు. ఎన్టీఆర్ పాత్రను పోషించడం తనకు లభించిన వరమని వ్యాఖ్యానించిన ఆయన, చిత్ర దర్శక, నిర్మాతలను త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు. హీరోయిన్ల ఎంపిక ప్రక్రియ అసలు మొదలు కాలేదని, ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఎన్నో అంశాలను అభిమానులు తెలుసుకోవచ్చని, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని అన్నారు.
ఎన్టీఆర్ ఆశయాల మేరకే చంద్రబాబు పనిచేస్తున్నారని, నిమ్మకూరును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా లోకేష్ వ్యాఖ్యానించారు. కులం, మతం పేరిట కొందరు రాజకీయాలు చేస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొట్టాలని, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకుల్లో అట్టడుగున ఉన్నాయని, హోదాతో పరిశ్రమలు రావన్న విషయం ఈ ర్యాంకులను చూస్తేనే తెలుస్తోందని లోకేష్ తెలిపారు.
As we have already informed our readers, for the first time in Bigg Boss Telugu…
The municipal elections in Andhra Pradesh ended on November 1, but the political battle did…