Telugu

ఎన్టీఆర్ పరువు తీస్తున్న బాలయ్య?

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఎట్టకేలకు విడుదల కాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈనెల 22 న విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను కూడా అతి త్వరలో విడుదలచేయనున్నారు. ఇక ఇటీవల విడుదలైన మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపరచడంతో ఈ చిత్రం మీద వివాదాలు అలముకున్నాయి.

దాదాపుగా 70-80% డబ్బులు కోల్పోయిన బయర్లు బాలయ్య ఆదుకుంటారని ఆశించారు. అయితే రూల్ ప్రకారం ఇవ్వాల్సిన 20% డబ్బు వాపసుకు కూడా చిత్ర నిర్మాతలు సహకరించడం లేదని బయర్లు ఆరోపిస్తున్నారు. దీనితో ఎన్టీఆర్ మహానాయకుడికి వారు దూరంగా ఉండటమే మంచిదని భావిస్తున్నారు. ఈ చిత్రం మీద డబ్బు పెట్టిన వారందరూ ఎన్టీఆర్ మీద అభిమానం తోనే పెట్టారు. పైగా బాలయ్యే ఈ చిత్ర నిర్మాత. అభిమానం వల్లే డబ్బు పోగొట్టుకున్నాం అనే పేరు వస్తే అది ఎన్టీఆర్ కే కళంకం.

ADVERTISEMENT

ఇప్పుడు ఇటువంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వడమేంటే ఎన్టీఆర్ ను అవమానించినట్టే. చిత్ర యూనిట్ లోని కొందరిని సంప్రదించగా “కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. అయితే వీటిని పరిష్కరించే ప్రయత్నంలోనే ఉన్నారు. కథానాయకుడు కొని నష్టపోయిన వారి ద్వారానే మహానాయకుడు విడుదల చెయ్యాలనే నిర్మాతల అభిమతం,” అని వారు అన్నారు. మొదటి భాగం ఫెయిల్యూర్ తో ఈ రెండవ భాగం ను ఎలాంటి హడావుడి లేకుండా విడుదలచేస్తున్నారు. మరి ఈ మహానాయకుడైన విజయం సాధిస్తుందో లేదో చూడాలి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Vaazha 2 Review: Packed with Youth Connect

BOTTOM LINE Packed with Youth Connect RATING 2.75/5 Story, Screenplay, Direction: Savin SA Cast: Vinayak…

1 hour ago

CSK vs MI: Kerala Star Leaves Hardik’s MI Helpless

Chennai Super Kings defeated Mumbai Indians by 103 runs in IPL 2026 at the Wankhede…

4 hours ago