
[m9ad]
అయితే 2019 మనకు అదే ఊపును ఇవ్వనుంది. పండగకి మరింత కళ రానుంది. ఇక్కడ తెలుగు లోనే కాదు అక్కడ తమిళ్ లో కూడా బడా హీరోలు అయినటువంటి రజనికాంత్, అజిత్ సినిమాలు కూడా బరిలో నిలుస్తున్నాయి. ఒక పక్క జై సింహ సినిమా హిట్ తో మంచి ఊపుమీద ఉన్న నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తో పండక్కి దిగుతూ ఉంటే, మరో పక్క ఒక రోజు అటు గా రంగస్థలం భారీ హిట్ తర్వాత చెర్రీ తన మాస్ మూవీ వినయవిధేయరామతో సంక్రాంతి బరిలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక తమిళంలో కూడా తమిళ తలైవార్ రజని కాంత్ రోబో 2.0 తర్వాత రెండు నెలలు కూడా గ్యాప్ లేకుండా “పెట్టా”గా మరోసారి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజు తన దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉండగా, మరో పక్క వీరం, వేదాలం తో భారీ హిట్ ఇచ్చిన, అజిత్-శివ కాంబినేషన్ మరో సారి శివ దర్శకత్వంలో అజిత్ పక్కా మాస్ ఎంటర్టేనర్ ‘విశ్వాసం’గా వస్తున్నాడు.
అంటే ఈ లెక్కన సంక్రాంతికి దక్షిణ భారత దేశంలో కలెక్షన్స్ వర్షం కురుస్తుంది అన్న మాట. బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వక తప్పదు. మరి ఇన్ని బారీ సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుందో తెలియాలి అంటే మన సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.
NTR and Trivikram Srinivas are reportedly planning a massive project with the working title God…
ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జ్లకు వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు…