
ఫస్ట్ టైమ్ జూనియర్- సుకుమార్ కాంబో కావడంతో ప్రేక్షకుల్లో ఏర్పడిన క్యూరియాసిటీని మరింతగా పెంచే విధంగా ప్రమోషన్ కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. ఈ సినిమాలో మూడు లేదా నాలుగు సన్నివేశాలు హైలైట్ అవుతాయని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం. ఫాదర్ సెంటిమెంట్‌పై వస్తున్న ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా నటించిన రాజేంద్రప్రసాద్ – ఎన్టీఆర్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని టాక్.
అలాగే సినిమాలో వచ్చే హాస్పటల్ సీన్లు… ఒకప్పటి ‘మాతృదేవోభవ’ సినిమాను గుర్తు చేస్తుందని అంటున్నారు. అలాగే జగపతిబాబు – జూనియర్, ఎన్టీఆర్ డైలాగ్స్, సాంగ్స్, స్టెప్స్ అన్నీ కలిసి “నాన్నకు ప్రేమతో” సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లాయని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి ఈ విషయాలలో ఎంత వాస్తవముందనేది జనవరి 13వ తేదీన తెలియబోతోంది. ఎందుకంటే, అదే రోజున సినిమా విడుదల కాబోతోందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
AK47: October 16 Buzz Gets Interesting Amid Release Uncertainty Venkatesh and Trivikram Srinivas’ Aadarsha Kutumbam…
Allari Naresh is back to entertaining audiences with his latest fantasy comedy, Ramba Oorvasi Menaka.…