
ఇది తెలియాలంటే గురువారం సాయంత్రం 5.40 నిముషాల వరకు వెయిట్ చేయాల్సిందే. వినాయకచవితి సందర్భంగా ఈ టీజర్ ను విడుదల చేస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే గతంలో ‘జై’ టీజర్ లీకేజ్ జరిగిన నేపధ్యంలో… ఈ సరికొత్త టీజర్ అలాంటి లీకేజ్ బారిన పడకుండా చిత్ర యూనిట్ పలు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ‘జై’ మాదిరి కాకుండా ‘లవ’ పాత్రను నేరుగా అఫిషియల్ టీజర్ ద్వారానే అవకాశం దక్కుతుంది.
ఇదిలా ఉంటే… ‘స్పైడర్’ మొదటి టీజర్లో ఏం చూపించకపోయినా మంచి స్పందనను తెచ్చుకోగా, రెండవ టీజర్ మాత్రం భారీ నెగటివ్ టాక్ ను కైవసం చేసుకుని అభిమానులను గందరగోళంలో పడేసింది. ‘స్పైడర్’ మాదిరే ‘జై లవకుశ’ మొదటి టీజర్ కు అనూహ్య స్పందన లభించింది. మరి రెండవ టీజర్ కూడా ‘స్పైడర్’నే అనుసరిస్తే, ‘యంగ్ టైగర్’ అభిమానులు నిరుత్సాహానికి గురికాక తప్పదు. అయితే ఇప్పటికే విడుదలైన ‘ఫస్ట్ లుక్’ పోస్టర్లో క్లాస్ గా అదిరిపోతున్నారు జూనియర్ ఎన్టీఆర్.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. పోలవరం నుంచి గోదావరి జలాలను అనకాపల్లి వైపు విడుదల చేస్తున్న నేపథ్యంలో…
Telugu cinema has always been heavily dependent on star power. Big heroes bring big openings,…