
సరిగ్గా ఇలాంటి డైలాగ్స్ చెప్తున్న పోస్టర్ నే చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఎన్టీఆర్ కళ్ళల్లో కసి చూస్తుంటే… అక్కడేదో ఓ భారీ డైలాగ్ సిల్వర్ స్క్రీన్ పై పేలబోతుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ డైలాగ్స్ వినే కంటే ముందు… ఈ పోస్టర్ ని చూస్తూ… అభిమానులు కొన్ని డైలాగ్స్ రాసుకోవడం మొదలుపెట్టారు. ‘కొట్టాలిరా…. ఈ సారి కొట్టే దెబ్బలకు మళ్ళీ మన వైపు చూడడానికే భయపడేలా కొట్టాలి…’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ వ్యక్తపరుస్తున్న డైలాగ్స్ కు కొదవలేదు.
అభిమానులకు మరింత ఉత్సాహపరిచే విషయం ఏమిటంటే… ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ చూసిన నటుడు బ్రహ్మాజీ, ‘ట్రైలర్ ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంది’ అంటూ అభిమానులను ఊరిస్తున్నాడు. ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతున్న ఆడియో వేడుకపై ఈ ట్రైలర్ కూడా సందడి చేయనుంది. ట్రైలర్ రాకతో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయని సినీ వర్గాలు కూడా చెప్పుకుంటున్నాయి. అంతవరకు ఇలాంటి ‘కసి’ ఉన్న పోస్టర్స్ చూసి ఎంజాయ్ చేయడమే అభిమానుల వంతు!
Directed by Venu Gopal Reddy, Romanchakam features Sumanth Prabhas and Ananthika Sanilkumar in the lead…
Former India batter Suresh Raina has spoken against the Impact Player rule in the IPL,…