Telugu

ఎన్టీఆర్ అభిమానుల కోరిక ఇన్నాళ్లకు తీరబోతుందా?

చాలా కాలం నుండి ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో సినిమాలకు థమన్, దేవి శ్రీ ప్రసాద్ కాకుండా ఫ్రెష్ ఫేస్ కావాలని తమ అభిమాన నటుడిని కోరుతున్నారు. దక్షిణాదిన నెక్స్ట్ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరుగాంచిన అనిరుధ్ రవిచందర్ తో పని చెయ్యాలని వారి కోరిక. అయితే అది ఇప్పటిదాకా నెరవేరలేదు.

ఇప్పుడు మొత్తానికి అభిమానుల మోర తారక్ ఆలకించాడని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ తన తదుపరి చిత్రంలో ఎన్టీఆర్ కోసం అనిరుధ్ రవిచందర్ తో కలిసి పనిచేయాలని యోచిస్తున్నాడట. #NTR30 గా పేర్కొనబడుతున్న ఈ కొత్త చిత్రం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసాకా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

ADVERTISEMENT

అనిరుధ్ బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్ బస్టర్లను ఇవ్వడం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమను శాసిస్తున్నాడు. అతని పాటలు కొన్ని తెలుగులో చార్ట్‌బస్టర్లుగా మారినప్పటికీ, అతను తెలుగులో తమిళనాట వచ్చినటువంటి విజయాన్ని పునరావృతం చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు అజ్ఞాతవాసి, ‘గ్యాంగ్ లీడర్’, ‘జెర్సీ’ వంటి తెలుగు చిత్రాలకు అనిరుధ్ సంగీతం సమకూర్చారు.

నాని నటించిన ‘జెర్సీ’ చిత్రంలో ఆయన సంగీతాన్ని విమర్శకులు మెచ్చుకున్నారు. కానీ అతను ఇంకా తెలుగులో పెద్ద కమర్షియల్ సక్సెస్ ని రుచి చూడలేదు. ఆ లోటు ఈ సినిమాతో తీరిపోవాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. దానికంటే ముందు ఈ వార్త అధికారికంగా ధృవీకరింపబడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Big Sequel Returns: Arshad as Solo Lead, Akshay Dropped

The Jolly LLB franchise is moving ahead with a new entry. The fourth part is…

28 minutes ago

Aakash Chopra’s Big Question Over KKR Star’s India Future

KKR Star Rinku Singh has been scoring runs regularly in the Ranji Trophy, but there…

58 minutes ago