జపాన్ లో ‘బుడ్డోడు’ బొమ్మ పడింది!

సంక్రాంతికి విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ – సుకుమార్ ల “నాన్నకు ప్రేమతో” సినిమా ఎట్టకేలకు బుడ్డోడును 50 కోట్ల క్లబ్ లో చేర్చింది. అయితే సినిమా బడ్జెట్ పరంగా నష్టాలతోనే ముగిసిందనే టాక్ ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ఏపీ, తెలంగాణాలలో ఈ సినిమా కొంత నష్టాలను మిగుల్చినప్పటికీ, ఓవర్సీస్ లో మాత్రం 2 మిలియన్ క్లబ్ లో చేరి అనూహ్య విజయాన్ని సాధించింది.

ఈ క్రమంలో ఈ సినిమాను జపాన్ భాషలో డబ్ చేసి విడుదల చేసారు. జపాన్ లో రజనీకాంత్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు క్రేజ్ ఉండడంతోనే ఈ డబ్బింగ్ సాధ్యమైందని ‘బుడ్డోడు’ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించి జపాన్ లో బొమ్మ పడినట్లుగా ఓ గ్రాఫిక్స్ ఫోటో చక్కర్లు కొడుతోంది. మొత్తానికి “నాన్నకు ప్రేమతో” సినిమా జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ అమాంతం పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Share
Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

4 hours ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

7 hours ago