
మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ పాడిన ‘కంత్రీ’ సినిమాలో ‘వన్… టు… త్రీ… నేనొక కంత్రీ…’ అనే పాట సూపర్ హిట్ అయ్యింది. అయితే ఎన్టీఆర్, మణిశర్మలకున్న క్రేజ్ రీత్యా అప్పట్లో ఆ పాటకు ఆదరణ లభించింది గానీ, ఎన్టీఆర్ స్వరం వినడానికి కాస్త ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. ఆ తర్వాత ‘అదుర్స్’ చిత్రంలో ‘చారి… చారి..’ పాట ద్వారా మరోసారి ప్రేక్షకులను పలకరించిన ఎన్టీఆర్, మళ్ళీ సూపర్ హిట్ అందుకున్నారు. అలాగే ‘రభస’ చిత్రంలో ‘రాకాసి రాకాసి’ అంటూ మళ్ళీ అభిమానులను ఆకట్టుకున్నారు.
అయితే ఎన్టీఆర్ పాడిన ప్రతి సందర్భంలో పాటలు హిట్టయ్యాయి గానీ, సినిమాలు మాత్రం అనుకున్నంత సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయాయి. ఉన్నంతలో ‘అదుర్స్’ సినిమా పర్వాలేదనే వసూళ్లను సాధించింది గానీ, వినాయక్ – ఎన్టీఆర్ ల రేంజ్ విజయాన్ని గానీ, సినిమాపై ఉన్న అంచనాలను గానీ అందుకోలేకపోయింది. మరి ఈ సెంటిమెంట్ తో ‘ఫాలో ఫాలో…’ అనే పాట కూడా సూపర్ హిట్ అవ్వడంతో “నాన్నకు ప్రేమతో” సినిమాపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ సారైనా ఎన్టీఆర్ ‘ఫేట్’ మార్చే సినిమాగా ఈ ‘పాట’ మారుతుందేమో చూడాలి.
Former India opener Shikhar Dhawan has dismissed claims that players from Jammu and Kashmir face…
కేసీఆర్ త్వరలోనే తన ఫామ్ హౌస్ అజ్ఞాతానికి శుభం కార్డు వెయ్యనున్నట్టుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆదివారం జరిగిన బిఆర్ఎస్…