Telugu

ఓజీ…. అమెరికాలో ఇంత అత్యుత్సాహం మంచిది కాదు!

 

ట్రంప్‌ నిర్ణయాలు, ప్రభుత్వ ఆంక్షల వలన ప్రస్తుతం అమెరికాలో విదేశీయులకు చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కనుక ఇప్పుడు చాలా సంయమనం అవసరం.

ADVERTISEMENT

కానీ ఓజీ సినిమా విడుదలవుతున్న సందర్భంగా అమెరికాలో అభిమానుల హడావుడి చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఓజీ జండాలు పెట్టుకొని కార్ ర్యాలీ చేశారు. థియేటర్ల బయట, లోపల హడావుడి షరా మామూలే!

దేశం కాని దేశంలో అదీ… పరిస్థితులు అసలు బాగోలేదని తెలిసి ఉన్నప్పుడు ఈవిదంగా చేస్తే కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లే! ఇటీవల వార్-2 విడుదలైనప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు. కానీ మళ్ళీ ‘ఓజీ’కి హడావుడి చేస్తున్నారు.

అమెరికాలో భారతీయులు ప్రదర్శిస్తున్న ఈ అత్యుత్సాహంపై ఇప్పటికే అమెరికన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

40-50 ఏళ్ళ క్రితం అమెరికాకు వచ్చి స్థిరపడిన భారతీయుల పట్ల అమెరికన్ సమాజం ఏనాడూ ఈవిదంగా వ్యతిరేకత చూపలేదు. కారణం… వారందరూ క్రమశిక్షణతో మెసులుకుంటూ కష్టపడి పనిచేస్తూ అమెరికన్ల మనసులు గెలుచుకోవడమే. అందువల్లే వారి తర్వాత తరానికి చెందిన ఉషా వాన్స్, కమలా హారిస్ వంటి ఎందరో అమెరికా సమాజంలో భాగంగా మారి అత్యున్నత స్థాయికి ఎదగలిగారు కూడా. కానీ ఇప్పటితరంవారు కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నట్లు వ్యవహరిస్తున్నారు.

‘అమెరికా ఫస్ట్’ అనే ట్రంప్ నినాదానికి అర్ధం అమెరికాకు, అమెరికన్లకు ప్రాధాన్యత అనే అర్ధం. కానీ విదేశీయులు మనకి అవసరం లేదనే పరమార్ధం దానిలోనే ఇమిడి ఉంది. ట్రంప్‌, ఆయన సన్నిహితులు అందరూ కూడా ఇదే చాలా విస్పష్టంగా చెపుతున్నారు కదా?

విదేశీయుల పట్ల ట్రంప్‌ వైఖరి ఈవిదంగా ఉన్నప్పుడు, అమెరికన్ పౌర సమాజంలో ద్వేషభావం పెరగకుండా ఉంటుందా?అటువంటప్పుడు అమెరికాలో ఉంటున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు మరెంత జాగ్రత్తగా ఉండాలి? కానీ ఎలా ఉంటున్నామని ఆలోచించుకుంటే మంచిది.

యూనివర్సిటీలలో చదువుకుంటున్న విదేశీ విద్యార్ధులను చిన్న చిన్న కారణాలతో చేతులకు, కాళ్ళకు బేడీలు వేసి అవమానకరంగా ఏవిదంగా భారత్‌కు పంపిస్తున్నారో అమెరికాలో ఉంటున్నవారందరూ కళ్ళారా చూశారు.

కనుక ఈవిదంగా రోడ్లపైకి వచ్చి, థియేటర్ల వద్ద అతి చేస్తుంటే ట్రంప్‌ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా?అమెరికన్లు ద్వేషించకుండా ఉంటారా?ఒకవేళ ఈ అత్యుత్సాహంపై కూడా ప్రభుత్వం చర్యలు చేపడితే మన పరిస్థితి ఏమిటి?అని ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తే మంచిది.

తాము చట్ట ప్రకారం ముందస్తు అనుమతులు తీసుకునే ర్యాలీలు, సంబరాలు చేసుకుంటున్నామని అనుకోవచ్చు. కానీ చట్టబద్దంగా చేస్తున్న ఈ హడావుడి అమెరికన్లకు ఆమోదయోగ్యం కాదని, ఇది తమ పట్ల వారిలో ద్వేషభావనలు పెంచుతోందని మరిచిపోకూడదు.

అమెరికాలో పుట్టి పెరుగుతున్న భారతీయుల పిల్లలపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. వారికీ ఈ సినిమాలు, ఈ రాజకీయాలతో సంబంధమే ఉండదు. కానీ వాటి కోసం తమ కుటుంబ సభ్యులు చేస్తున్న హడావుడితో వారు స్కూళ్ళు, కాలేజీలలో సాటి అమెరికన్ విద్యార్ధుల నుంచి వివక్ష ఎదుర్కొంటున్నారు

తాము ఏ తప్పు చేయనప్పటికీ సాటి విద్యార్ధులు తమతో ఎందుకిలా వ్యవహరిస్తున్నారు?అనే ప్రశ్నకు వారి తల్లితండ్రులే జవాబు చెప్పాలి. పిల్లల భవిష్యత్ కూడా ఇబ్బందికరంగా మారితే, అప్పుడు ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదని గ్రహిస్తే మంచిది.

ఈ అత్యుత్సాహం వారికి ఎంత మాత్రం మంచిది కాదు. అలాగే తమ వలన భారత్‌ ప్రతిష్టకు కూడా భంగం కలుగుతుందని మరిచిపోకూడదు. తానా, నాటా వంటి సంస్థల పెద్దలు చొరవ తీసుకొని ఈ సమస్యపై యువతకు మార్గదర్శనం చేస్తే బాగుంటుంది.

 

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Sneha In Kaaka? This Casting Buzz Is Interesting

A new casting buzz around Chiranjeevi’s Kaaka is getting attention. Actress Sneha is reportedly joining…

31 minutes ago

రేవంత్ రెడ్డిని కేసీఆర్‌ తక్కువ అంచనా వేశారా?

కేసీఆర్‌ ఫామ్‌హౌసులో కూర్చొని శాసనసభ సమావేశాలలో 22ఏ నిషేదిత భూముల వ్యవహారంపై అద్భుతమైన వ్యూహం రచించి సిఎం రేవంత్‌ రెడ్డిని…

32 minutes ago