
ఈ సినిమా విడుదలకు ముందు పబ్లిసిటీలో భాగంగా, చిత్ర బృందం మూడు నెలలకు ముందు ఈ రీమిక్స్ పాటను విడుదల చేసింది. విడుదలైన నాటి నుండి ఇప్పటివరకు ఈ పాట ఒక్క యూ ట్యూబ్ లోనే 15 కోట్ల 33 లక్షల వ్యూస్ ను సాధించింది. ఈ పాటకు లభిస్తున్న ఆదరణ పట్ల సోనీ మ్యూజిక్ ఇండియా సంస్థ తమ ట్విట్టర్ ఖాతాలో హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన ‘హమ్మ హమ్మ’ పాటను “ఓకే జాను” కోసం రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే.
ఈ పాటలో శ్రద్ధాకపూర్ అందాలకు రెహమాన్ మ్యూజిక్ తోడవడంతో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తుంది. ఇప్పటివరకు యూ ట్యూబ్‌లో బేఫికర్ లోని ‘నషే సి చద్’ 20 కోట్ల 11 లక్షల వ్యూస్ తో తొలిస్థానంలో ఉంది. ఈ వీడియో సాంగ్‌ను గత ఏడాది అక్టోబర్ 18న విడుదల చేయగా, ఆ తరువాత బార్ బార్ దేఖో సినిమాలోని ‘కాలా చెష్మా’ 20 కోట్ల 2 లక్షల వ్యూస్ తో రెండో స్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానంలో రెహమాన్ ‘హమ్మ హమ్మ’ సాంగ్ నిలిచింది.
Allari Naresh is officially back in top form with Ramba Oorvasi Menaka, reminding everyone of…
The Congress leadership took the tough call of firing Konda Surekha from her Cabinet position…