
ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కాబోతున్న కింగ్ నాగార్జున “ఓం నమో వేంకటేశాయ” సినిమా పరాజయం పాలయ్యే అవకాశాలే ఎక్కువని తాజాగా సోషల్ మీడియాలో ‘సెన్సార్ టాక్’ పేరుతో హల్చల్ చేస్తున్న విషయం. ఈ టాక్ అక్కినేని అభిమానులను కాస్త నిరుత్సాహపరిచే అంశమే అయినా, ఈ సినిమాలో నాగార్జున మాత్రం మరోసారి అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు కొల్లగొడతాడనేది సినిమాలో ప్రధాన ప్లస్ పాయింట్ గా చెప్తున్నారు.
అలాగే ఏమోషనల్ సాగే క్లైమాక్స్ కాస్త ఊరట కలిగించినా, గ్రాఫిక్స్ వర్క్, పాటలు, స్క్రీన్ ప్లే తదితర అంశాలను ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమవుతాయి అనేవి మైనస్ పాయింట్స్ గా తెలుస్తోంది. మొత్తమ్మీద సిల్వర్ స్క్రీన్ కంటే బుల్లితెరపై ఎక్కువగా అలరించే చిత్రంగా ఫైనల్ టాక్. అయితే అన్ని పెద్ద చిత్రాలను ‘సూపర్ హిట్’ అని ప్రచారం చేసే సెన్సార్ టాక్, ఈ సినిమా నెగిటివ్ చెప్పడమనేది పారదర్శకత అని చెప్పాలా లేక నాగ్ సినిమాను టార్గెట్ చేసారని భావించాలా? ఇది తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…