
ఇక విషయానికి వస్తే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఇలాంటి వాటిని మినహాయింపు కాదు. ఒక భారీ బంగాళా సెటప్. ఆ కుటుంబానికో పెద్దగా తాతయ్య లేదా నాన్న. ఆణువణువూ హుందాతనం ఉట్టిపడే ఓ తల్లి లేదా అత్తయ్య టైపు క్యారెక్టర్. హీరో హీరోయిన్లు ఇద్దరికీ వీళ్ళతో బంధుత్వాలు ముడిపెట్టి చిక్కని క్లాస్ మాస్ వంటకం ఆయన ప్రత్యేకంగా అనుసరించే స్టయిల్. అల వైకుంఠపురములో సచిన్ కెడ్కర్ – టబు, అత్తారింటికి దారేదిలో బోమన్ ఇరానీ – నదియా, అతడులో నాజర్ లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
అసలివేవీ లేకుండా డిఫరెంట్ సబ్జెక్టుతో తీసిన ఖలేజా ఏమయ్యిందో చూశాం. టీవీలో వచ్చాక కల్ట్ క్లాసిక్ అని ఎన్ని పొగడ్తలు గుప్పించినా అది థియేటర్లలో ఆడలేదు. అజ్ఞాతవాసిలోనూ పైన చెప్పినవాటిని దూరం పెడితే పవన్ ఫ్యాన్స్ జీవితాంతం గుర్తుపెట్టుకునే డిజాస్టర్ దక్కింది. అఆలో తాత లేడు కానీ నదియా మిస్ కాలేదు. డెబ్యూ మూవీ నువ్వే నువ్వే సైతం తండ్రి చుట్టూ తిరిగేదే. జల్సాలో ఇవి లేవు కానీ అది సాధించిన సక్సెస్ కేవలం హిట్ మాత్రమే. ఇండస్ట్రీ రికార్డులు దక్కలేదు. అరవింద సమేత వీర రాఘవలో తిరిగి పెద్దావిడ, బంగాళా ఉన్నాయి
సన్ అఫ్ సత్యముర్తిలో తాత అత్తా ఇద్దరూ లేకపోయినా భవంతులు మాత్రం మిస్ కాలేదు. ఇప్పుడు మహేష్ బాబు 28లోనూ ఇవి ఉండబోతున్నాయి. ప్రకాష్ రాజ్ వృద్ధవేషంలో కనిపించనుండగా ఇంకో పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ కు త్వరలోనే ఆర్టిస్ట్ ని ఫిక్స్ చేయబోతున్నారు. ఇదంతా కాకతాళీయంగా జరిగిందని చెప్పలేం. ఈ అంశాలు బలంగా ఉండాలని కోరుకునే త్రివిక్రమ్ పాత్రలను తీర్చిదిద్దడం కనిపిస్తోంది. ఎలాంటి మల్టీ మిలియనీర్ల హడావిడి లేని ఓ సాధారణ మధ్య తరగతి కథను మాటల మాంత్రికుడి కలం నుంచి దర్శకత్వం నుంచి రావాలని కోరుకోవడం తప్పు కాదేమో. ఆయనే రచన చేసిన నువ్వు నాకు నచ్చావ్, చిరునవ్వుతో తరహాలో.
ఇటీవల జనసేన పార్టీలో చేరిన వంగవీటి రాధాకృష్ణకు అందరూ ఊహించినట్లే ఆ పార్టీ మేయర్ అభ్యర్ధిగా అవకాశం దక్కించుకున్నారు. వంగవీటి…
Naga Vamsi has confirmed a film with director Nelson Dilipkumar and music composer Anirudh Ravichander…